ABN Big Debate: టీడీపీలో నేను, రేవంత్ కలిసి పనిచేశాం.. సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 22 , 2024 | 07:54 PM
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేడు (సోమవారం) ‘బిగ్ డిబేట్’ చర్చకు బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్ (CM RAMESH) వచ్చారు.
ABN Big Debate: ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేడు (సోమవారం) ‘బిగ్ డిబేట్’ చర్చకు బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్ (CM Ramesh) వచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీలో తాను, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కలిసి పనిచేశామని చెప్పుకొచ్చారు. స్నేహం వేరు.. రాజకీయం వేరని అన్నారు. తనకు చాలా పార్టీల్లో స్నేహితులు ఉన్నారని తెలిపారు. తాను కాంగ్రెస్‌కు ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
కంపెనీ ఇచ్చిన వాటితో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. 10 ఏళ్ల క్రితమే కంపెనీని వదిలేశానని అన్నారు. తనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నారు. రెంటల్ ఇన్‌కమ్ వస్తుందని తెలిపారు. తనకు, తన భార్యకు నెలకు రూ.25 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. పార్లమెంట్ మెంబర్‌గా జీతం వస్తుందని సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా స్పందనతో అనకాపల్లి ఎన్నికలను ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు.
అసెంబ్లీకి స్థానికుడైతే బాగుంటుందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ అభ్యర్థికి పరిచయాలు, పలుకుబడి కావాలని చెప్పారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని దేశమంతా తెలుసునని జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని సీఎం రమేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క జగన్ తప్పితే.. దేశంలో ఏ సీఎంతో అయినా మాట్లాడగలనని సీఎం రమేష్ అన్నారు.
Updated Date - Apr 22 , 2024 | 08:09 PM