ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Telugu: ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసలు..

ABN, Publish Date - Jul 01 , 2024 | 01:30 PM

తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రారాజుగా నిలుస్తూ వస్తోంది.

ABN-Andhrajyothy

తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రారాజుగా నిలుస్తూ వస్తోంది. దీనికి నిదర్శనమే కేంద్ర ఆర్థికశాఖ నుంచి వరుసగా ప్రశంసలు అందుకోవడం. మీడియాను, పరపతిని అడ్డుపెట్టుకుని పన్నులు ఎగ్గొట్టాలని చూస్తున్న ఈరోజుల్లో పారదర్శకంగా పన్నులు చేలిస్తూ.. తన కర్తవ్యాన్ని నీతి, నిజాయితీగా నిర్వర్తిస్తోంది. కేవలం నీతి వాఖ్యాలు చెప్పడం కాదు.. పాటించాలనే నానుడిని నిజం చేస్తూ.. ప్రతి ఏడాది సక్రమంగా పన్నులు చెల్లిస్తూ వస్తోంది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి. దీనిలో భాగంగా పన్నుల చెల్లింపుల్లో వరుసగా మూడో సారి కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసలు అందుకుంది.

2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో సకాలంలో, సక్రమంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి, జీఎస్టీ చెల్లించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అభినందనలు అందుకుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ 36AAHCA3752H1ZP కలిగిన ‘ఆమోద బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ను అభినందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసా పత్రాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ యాజమాన్యానికి పంపింది. 2023-24 సంవత్సరానికి జీఎస్టీ సక్రమంగా చెల్లించినందుకు ఆర్థిక శాఖ ప్రశంసాపత్రాన్ని పంపించింది. సక్రమంగా ఆదాయపు పన్ను చెల్లిస్తూ నవ భారత నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ని సీబీఐసీ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ (CBIC Chairman) అభినందించారు. ఈ ప్రశంసా పత్రాలు బాధ్యత కలిగిన మీడియా సంస్థ అయిన ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ నిజాయతీకి నిదర్శనం. ఈ అభినందన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిబద్ధతకు తార్కాణం. అవినీతి సొమ్ముతో స్థాపించిన బాకా ఛానెళ్ల నైజం మాది కాదని చెప్పడానికి ఈ ప్రశంసా పత్రాలు ఒక కొలమానం.


ప్రతి ఏటా పారదర్శకంగా...

2009లో ఏబీఎన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకూ ట్యాక్స్ చెల్లింపుల్లో పారదర్శకంగా నిలిచిన సంస్థ మాది అని నిస్సందేహంగా, నిఖార్సైన సొమ్ముతో నడుస్తున్న మీడియా సంస్థగా గర్వంగా చెబుతున్నాం. ప్రజల హక్కు అయిన సమాచారాన్ని.. వక్రీకరించకుండా, వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యతను తొలినుంచీ ఆచరిస్తూ అమలు చేస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ధైర్యమే పెట్టుబడిగా, ఆత్మసంతృప్తే రాబడిగా.. ముందుకు దూసుకెళ్తోంది. ఆ క్రమంలోనే జనంలో 'డేర్‌ డెవిల్ ఇమేజ్‌'ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబీఎన్‌ పేరెత్తగానే దమ్మున్న ఛానెల్‌గా, దుమ్మురేపే ఛానెల్‌గా గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది.


విశ్వసనీయతతో ముందుకు..

పారదర్శకతకు, నిబద్ధతకు మారుపేరుగా ఉన్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు. పన్నులు ఎగ్గొట్టేందుకు మార్గాలు వెతుక్కునే సంస్థలు, వ్యక్తులు, వైసీపీ వంటి పార్టీలు ఏబీఎన్‌ను విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవరు ఎలాంటి దుష్ప్రచారం చేసినా తెలుగు లోగిళ్లలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ న్యూస్ ఛానల్‌ కనిపిస్తూనే ఉంటుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగు ప్రజల ఆదరణ ముందు అవన్నీ దిగదుడుపే. సక్రమంగా, సకాలంలో పన్నులు చెల్లిస్తూ, అవినీతి సొమ్ముతో నడిచే ఛానళ్ల మాదిరిగా కాకుండా ఎప్పటిలానే విశ్వసనీయతతో ముందుకెళతామని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ తెలుగు ప్రజలకు మరోమారు మాటిస్తోంది.


మరిన్ని ఆంధ్రజ్యోతి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhrajyothy Telugu News

Updated Date - Jul 01 , 2024 | 01:53 PM

Advertising
Advertising