ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Daggubati Purandeshwari : జగన్‌ పేరు లేదా?

ABN, Publish Date - Dec 01 , 2024 | 05:07 AM

‘ఆంధ్రప్రదేశ్‌కు అదానీ మూడు సార్లు వచ్చి విద్యుత్‌ ఒప్పందం చేసుకుని వెళితే అప్పటి ముఖ్యమంత్రికి ఈ విషయం తెలీదా? అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడా లేదంటోన్న జగన్‌ వ్యాఖ్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

  • నివేదికను ఆసాంతం ఆయన చదవాలి

  • కాకినాడ పోర్టుపై పవన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం: పురందేశ్వరి

అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌కు అదానీ మూడు సార్లు వచ్చి విద్యుత్‌ ఒప్పందం చేసుకుని వెళితే అప్పటి ముఖ్యమంత్రికి ఈ విషయం తెలీదా? అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడా లేదంటోన్న జగన్‌ వ్యాఖ్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నివేదిక మొత్తం చదివి ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ఎవరో ప్రజలకు చెప్పాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సంఘటనా పర్వ్‌లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘విద్యుత్‌ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డి అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికల్లో ఏముందో చదవాలి. అందులో ఏపీ, తమిళనాడు, ఒడిశా, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వాల పెద్దల ప్రస్తావన ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఆ సమయంలో జరిగిన వాటికి జగన్‌, స్టాలిన్‌, నవీన్‌ పట్నాయక్‌ బాధ్యత వహించాలి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేకున్నా అదానీతో బీజేపీకి సంబంధాలు అంటగట్టి రాద్ధాంతం చేయడం ఇండీ కూటమికి తగదు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం ఎగుమతి అవుతున్నట్లే అక్రమంగా ఆయుధాలు దిగుమతై దేశ భద్రతకు ముప్పు కాబోవా అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ సమర్థిస్తోంది. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులపై చాలాకాలంగా బీజేపీ ప్రశ్నిస్తూనే ఉంది.


గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకుల పేర్లు ఇందులో బలంగా వినిపించాయి. ఆర్టీపీపీ బూడిద వివాదంపై సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వివరణ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రస్తావించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొస్తాం. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో బీజేపీ తరఫున అభ్యర్థి ఉంటారో లేదో ఢిల్లీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది’ అని అన్నారు. పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లక్ష్మణ్‌ (రాజ్యసభ ఎంపీ) మాట్లాడుతూ, ‘దేశం కోసమే బీజేపీ పని చేస్తుంది. ప్రతి కార్యకర్త దేశ సేవకు కట్టుబడి ఉండటం ముఖ్యం. సిద్ధాంతమే పరమావధిగా దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ పార్టీని విస్తరించాలి. పోలింగ్‌ బూత్‌, మండల, జిల్లా ఎన్నికలు జనవరిలోపు పూర్తి చేయాలి’ అని పార్టీ శ్రేణులు, నేతలకు సూచించారు.

Updated Date - Dec 01 , 2024 | 05:07 AM