South Central Railway: ఓటు వేసేందుకు ఆంధ్రా వెళ్తున్నారా.. గుడ్ న్యూస్
ABN, Publish Date - May 10 , 2024 | 06:53 PM
మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు సైతం జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సైతం అదే రోజు జరుగనున్నాయి.
హైదరాబాద్, మే 10: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు సైతం జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సైతం అదే రోజు జరుగనున్నాయి. అయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లోని ఆంధ్రా సెటిలర్లంతా... ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకోనేందుకు సిద్దమయ్యారు.
Money Laundering Case : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. స్పందించిన సునీత
ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లంతా.. వారి సొంత ఊర్లకు వెళ్లిపోయారు. మరికొంత మంది బస్సులు, రైళ్లలో వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్నారు. దీంతో వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగింది. అలాంటి వేళ ప్రయాణికుల రద్దీతోపాటు వేసవిని దృష్టిలో పెట్టుకొని.. పలు రైళ్లలో ప్రత్యేక భోగీలను ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది.
LokSabha Elections: చెత్త కుప్పలో ఓటరు ఐడీలు.. విచారణకు ఆదేశం
AP Elections: రోజా నిజస్వరూపం పోసాని లీలలు బయటపెట్టిన కిరాక్ ఆర్పీ ..!
మే 10వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు పలు మార్గాల్లో ఈ అదనపు కోచ్‌లు సేవలు అందించనున్నాయి. వీటిలో థార్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైళ్ల వివరాలను కింద చూసుకోవచ్చు. ఈ రైల్వే సర్వీసులన్నీ ఆంద్రా, తెలంగాణ మధ్యే నడుస్తాయి.
Read Latest Nationa News And Telugu News
Updated Date - May 10 , 2024 | 09:57 PM