ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Excise Department : ఎక్సైజ్‌లో కేసుల రగడ!

ABN, Publish Date - Dec 16 , 2024 | 06:38 AM

రాష్ట్రంలో మద్యం వ్యాపారం గందరగోళంగా మారింది. పాలసీ సమయంలో ఉత్సాహంగా పదుల సంఖ్యలో దరఖాస్తులు వేసిన వ్యాపారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

  • బెల్టుషాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దూకుడు

  • సీసాపై హోలోగ్రామ్‌తో షాపుల ట్రాకింగ్‌

  • దాని ఆధారంగా షాపుపైనా కేసు నమోదు

  • రూ.5లక్షల జరిమానాతో లైసెన్సీల బెంబేలు

  • ఇప్పటికే మార్జిన్లో సగమే వస్తోందని గగ్గోలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో మద్యం వ్యాపారం గందరగోళంగా మారింది. పాలసీ సమయంలో ఉత్సాహంగా పదుల సంఖ్యలో దరఖాస్తులు వేసిన వ్యాపారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న మార్జిన్‌లో సగమే వస్తోందని ఓవైపు ఆందోళన చెందుతుంటే తాజాగా జరిమానాలు రూ.5 లక్షలకు పెంచడం వారిని బెంబేలెత్తిస్తోంది. వ్యాపారుల పరిస్థితి గమనించిన ఎక్సైజ్‌ శాఖ కేసుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ అదే శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం మాత్రం దూకుడుగా వ్యవహరిస్తూ, నిత్యం దాడులతో బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ దాడుల్లో దొరికిన మద్యం సీసాలపై ఉన్న హోల్‌గ్రామ్‌ ఆధారంగా షాపులకు అనుసంధానం చేయడం లైసెన్సీలను మరింత భయపెడుతోంది. ఎక్కువ వ్యాపారం చేస్తే బెల్టుల పేరుతో కేసుల్లో చిక్కుకుంటామన్న భయం వారిలో పెరుగుతోంది. అలాగని వ్యాపారం తగ్గితే పెట్టుబడి వెనక్కి రాదని ఆందోళన చెందుతున్నారు. అక్రమాలను అరికట్టడంతోపాటు ఆదాయం తగ్గకుండా చూసే బాధ్యత కూడా ఎక్సైజ్‌ శాఖకు ఉంటుంది. బెల్టులపై దూకుడు పెంచితే అమ్మకాలు తగ్గిపోయి ఆదాయం పడిపోతుందేమోనన్న వాదన ఆ శాఖలో వినిపిస్తోంది. మొత్తంగా కేసులు పెట్టాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఆ శాఖ ఉండగా, వ్యాపారం కష్టంగా మారిందని లైసెన్సీలు వాపోతున్నారు.


  • మార్జిన్‌లోనే అసలు చిక్కు

ఇష్యూ ప్రైస్‌పై 20శాతం మార్జిన్‌ వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎక్సైజ్‌ శాఖ చివరికి అందులో సగమే లైసెన్సీలకు ఇస్తోంది. అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఏఆర్‌ఈటీ)లో వాటా ఇవ్వకపోవడంతో తమకు దాదాపు 10శాతమే మార్జిన్‌ దక్కుతోందని వారు గగ్గోలుపెడుతున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. అదే సమయంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు జరిమానాలను ప్రభుత్వం రూ.5లక్షలకు పెంచింది. రెండోసారి కేసు పెడితే ఏకంగా లైసెన్స్‌ రద్దుచేసేలా నిబంధనలు మార్చింది.

  • మంత్రి పేషీ నుంచే ఫోన్లు

కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) విభాగం దాదాపు 400 కేసులు పెట్టింది. అయితే కేసుల విషయంలో అధికారులపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కడైనా దాడులు చేసినా వెంటనే రాజకీయ నేతలు ఫోన్లు చేసి వాటిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర పేషీలోని ఓ అధికారి స్వయంగా ఫోన్లు చేసి కేసులు పెట్టొద్దని ఒత్తిడి చేస్తున్నారు. ఓవైపు అక్రమాలపై కేసులు పెట్టాలని సీఎం చెబుతుంటే, మంత్రి పేషీ నుంచే కేసులు వద్దని అడ్డుకోవడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.


  • షాపులతో అనుసంధానం

బెల్టుషాపుల్లో పట్టుబడిన సీసాలపై ఉన్న హోలోగ్రామ్‌ను స్కాన్‌చేస్తే అది ఏ షాపులో విక్రయించారో తెలుస్తుంది. దాని ఆధారంగా ఆ షాపుపైనా అధికారులు కేసు నమోదు చేస్తున్నారు. దాన్ని పరిశీలించి కమిషనర్‌ షాపును సస్పెండ్‌ చేస్తే జరిమానా చెల్లించాలి. అదే ఉల్లంఘనకు రెండోసారి పాల్పడితే లైసెన్సు రద్దవుతుంది. అయితే నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి గరిష్ఠంగా మూడు సీసాలు కొనుగోలు చేయవచ్చని, అలా తీసుకెళ్లిన ఎవరైనా బెల్టుల్లో అమ్మితే దానికి తమను బాధ్యుల్ని చేయడమేంటని లైసెన్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్జిన్‌ సగమే వస్తోందని బాధపడుతుంటే, ఈ స్థాయిలో జరిమానాలు విధిస్తే ఇక వ్యాపారం ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Dec 16 , 2024 | 06:38 AM