ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Grama Sachivalayam : సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన

ABN, Publish Date - Aug 09 , 2024 | 05:16 AM

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.

  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

  • పలువురు కార్యదర్శులను వారి మాతృశాఖకు అప్పగింత

  • క్లస్టర్‌ వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు సేవలందించే యోచన

  • వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశంలో చర్చలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిన వైసీపీ సర్కారు మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం, వారికి జాబ్‌చార్ట్‌ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, మరికొందరికి అసలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అని తేల్చారు. గ్రామాల్లో ఏఎన్‌ఎం, వీఆర్వో, డిజిటల్‌ అసిస్టెంట్‌, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలినవారిని వారి మాతృసంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని డీడీవోగా నియమిస్తారు.

అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్‌, ఏఎన్‌ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారినందరినీ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌ అసిస్టెంట్‌లు, విలేజ్‌ సర్వేయర్‌ అసిస్టెంట్‌, పశుసంవర్థక సహాయకులు తదితర పోస్టులను రద్దుచేసి క్లస్టర్‌ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్‌ కింద గ్రామ పంచాయతీలకే పరిమితం చేయనున్నారు. రాష్ట్రంలో 10,960 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డు సచివాలయాల్లో సుమారు 1.26లక్షల మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు.


క్లస్టర్‌ వ్యవస్థకు శ్రీకారం...

టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్‌ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. ప్రతి 5వేల మది జనాభాకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని భావించారు. అప్పట్లో దానిపై సమగ్రమైన ప్రణాళికలు రూపొందించారు. అది కార్యరూపం దాల్చకముందే వచ్చిన వైసీపీ సర్కారు గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించారన్న గొప్ప తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదు.

ఈ వ్యవస్థను ఏం చేయాలనే దానిపై కూటమి ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు అవసరమైన ఐదారుగురు కార్యదర్శులను అక్కడే ఉంచి మిగిలినవారిని ఆయా మాతృసంస్థలకు పంపడం ద్వారా ఆయా శాఖలను బలోపేతం చేసినట్లవుతుందని చెబుతున్నారు. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలందించేలా ఈ సచివాలయాలను తీర్చిదిద్దనున్నారు. దీనిద్వారా మానవ వనరులు వృధా కాకుండా ప్రజలకు విస్తృత సేవలందించే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.

Updated Date - Aug 09 , 2024 | 08:30 AM

Advertising
Advertising
<