Amaravati Farmers: సీఎం జగన్ పాపం పండనుంది
ABN, Publish Date - Jun 02 , 2024 | 01:41 PM
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాపాలు ఈ నెల 4వ తేదీతో పండనుందని అమరావతి రైతు ఆలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంతటితో ఆయన పరిపాలన అంతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రిని తాము ఎన్నడూ చూడలేదన్నారు.
అమరావతి, జూన్ 02: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాపాలు ఈ నెల 4వ తేదీతో పండనున్నాయని అమరావతి రైతు ఆలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంతటితో ఆయన పరిపాలన అంతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రిని తాము ఎన్నడూ చూడలేదన్నారు. పార్టీకి ఓటు వేసినా.. వేయకున్నా ప్రజల మీద ముఖ్యమంత్రికి ప్రేమ అనేది ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: అవి గుర్తుకు వస్తే దుఃఖం వస్తుంది: కేసీఆర్
ఆదివారం రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో కూటమి విజయం సాధించాలంటూ ఆ ప్రాంత రైతులు యజ్జం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ఆలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల అవమానాలు అనుభవించామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!
పోలీసులు సైతం తమపై కేసులు నమోదు చేశారని వివరించారు. లాఠీ దెబ్బలు సైతం తిన్నామన్నారు. ఇలా ఈ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. చివరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అలాగే అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రలు సైతం చేపట్టామని.. ఆ క్రమంలో నడి రోడ్డుపై భోజనాలు చేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ని నిర్బంధాలున్నా వాటన్నింటిని ఛేదించి.. ఈ పాదయాత్ర పూర్తి చేశామన్నారు. ఇంకా చెప్పాలంటే గత అయిదు సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి కిరాతకాలకు తాము బలయ్యామన్నారు. అయితే రాజధాని అమరావతిని నిర్మించే పార్టీ ఘన విజయం సాధించాలని ఈ యజ్జం చేపట్టినట్లు ఆలూరి శ్రీనివాసరావు వివరించారు.
Also Read: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: కేటీఆర్
అమరావతి మహిళా రైతు మాధవి మాట్లాడుతూ.. అమరావతి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం సైతం ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆమె ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం జరిగితేనే...అమరావతి అనే చెట్టు ఫలాలు అందరికి అందుతాయని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు. మరో రైతు మణిపూర్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో అందరికీ మంచి జరగాలని ఏకాదశి పర్వదినాన యజ్జం చేస్తున్నట్లు వివరించారు.
For Latest News and National News click here..
Updated Date - Jun 02 , 2024 | 01:47 PM