ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amit Shah: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు

ABN, Publish Date - May 31 , 2024 | 08:57 AM

మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.

తిరుమల: మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అమిత్ షా దంపతులకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Sajjala Ramakrishna Reddy: పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు.. సజ్జలపై క్రిమినల్ కేస్..


గత కొద్ది రోజులుగా అమిత్ షా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి తమిళనాడు వరకూ పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇవాళ తిరుమల శ్రీవారి సన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల తుది విడత ప్రచారం ముగియడంతో నిన్న సాయంత్రం 6.15 గంటలకు అమిత్ షా దంపతులు రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి వకుళామాత అతిథిగృహంలో బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించున్నారు. నేటి మధ్యాహ్నం తిరుమల నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు అమిత్ షా శ్రీవారిని దర్శించుకోవటానికి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

భోగాపురం భూములు.. భోంచేశారు!

Read more AP News and Telugu News

Updated Date - May 31 , 2024 | 08:58 AM

Advertising
Advertising