ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Lokesh: మంగళగిరిలో నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:56 PM

ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

అమరావతి: ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. నేడు మంగళగిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో లోకేష్ బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొనడానికి నారా లోకేష్ వెళ్లారు.


అయితే తన భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉన్న విషయాన్ని నారా లోకేష్ గమనించారు. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని, ఉన్నతాధికారులు తన భద్రతా విధుల్లో పాల్గొనవద్దని వారికి మంత్రి చెప్పారు. ఉన్నతాధికారులు మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయి ని 100 రోజుల్లో పూర్తిగా అరికట్టే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు రక్షణ, శాంతి భద్రతలు, ఇతర ముఖ్యమైన అంశాలపై మాత్రమే ఉన్నతాధికారులు పనిచేయాలని నారా లోకేష్ సూచించారు.

Updated Date - Jun 17 , 2024 | 12:57 PM

Advertising
Advertising