ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహాబలమేదో కృష్ణయ్య, శ్రీనివాస్‌ల చేత ఈ అద్భుతాల్ని చేయిస్తోంది: మంత్రి రామనారాయణరెడ్డి

ABN, Publish Date - Jul 12 , 2024 | 11:40 PM

శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సాయంకాలం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామస్తోత్రమ్’ మంగళగ్రంధాన్ని ఆవిష్కరించి.. స్వయంభూ క్షేత్రాలలో వేలకొలది అద్భుత గ్రంధాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యను అభినందించారు. అలాగే వివిధ శాస్త్రాల ప్రమాణంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక చైతన్య కృషి వెనుక దైవబలం ఉందని, దైవబలం లేకుంటే ఇన్ని అపూర్వాలు సమాజానికి అందవని, పురాణపండ యజ్ఞకార్యాన్ని ఆయన ప్రశంసించారు.

విజయవాడ, జులై 12: శరన్నవరాత్రులు, వసంత నవరాత్రుల వలె ఆషాఢ నవరాత్రులు కూడా దేవీ పూజకు ప్రధానమైనవని, ఈ నవరాత్రులలో అమ్మవారి క్రియాశక్తిరూపమైన వారాహీదేవిని పూజించడం సంప్రదాయం కాబట్టి.. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గాదేవిని వారాహి శక్తి స్వరూపంగా సంభావించుకుని పవిత్రార్చనలు జరుపుతున్నట్లు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానముల డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో క్రొత్త తరహాలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా రూపుదిద్దుకున్న ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్రమ్’ గ్రంథ విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు.

శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సాయంకాలం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామస్తోత్రమ్’ మంగళగ్రంధాన్ని ఆవిష్కరించి.. స్వయంభూ క్షేత్రాలలో వేలకొలది అద్భుత గ్రంధాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యను అభినందించారు.

వివిధ శాస్త్రాల ప్రమాణంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక చైతన్య కృషి వెనుక దైవబలం ఉందని, దైవబలం లేకుంటే ఇన్ని అపూర్వాలు సమాజానికి అందవని, పురాణపండ యజ్ఞకార్యాన్ని రామనారాయణరెడ్డి ప్రశంసించారు.

బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ సమక్షంలో, హైదరాబాద్ కిమ్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో, బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఒకేసారి పురాణపండ శ్రీనివాస్ పవిత్ర శోభల శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్రమ్‌ను ఆవిష్కరించడం పట్ల శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానముల డిప్యూటీ కలేక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు హర్షం వ్యక్తం చేశారు.

అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చే పురాణపండ శ్రీనివాస్ తపశ్శక్తిమయ గ్రంధాలను బొల్లినేని కృష్ణయ్య ఉభయరాష్ట్రాలలో అనేక దేవాలయాలకు ఉచిత వితరణకోసం వేలాది ప్రతులు అందించడం దేవాలయాల చరిత్రలో చరిత్రాత్మకమని అనేక ఆలయాల పండితులు, ధర్మకర్తలు, అర్చకులు ముక్తకంఠంతో జేజేలు పలుకుతున్నారు.

Updated Date - Jul 12 , 2024 | 11:56 PM

Advertising
Advertising
<