ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur:126 అంకెలు కాదు... బాలుడి పేరు

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:53 PM

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు. సాధారణంగా తమ పిల్లలకు దేవుడికి సంబంధించినది కానీ తమ పూర్వీకులకు సంబంధించిన పేరు కానీ పె ట్టుకుంటారు.

తాడిపత్రి(అనంతపురం): ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు. సాధారణంగా తమ పిల్లలకు దేవుడికి సంబంధించినది కానీ తమ పూర్వీకులకు సంబంధించిన పేరు కానీ పె ట్టుకుంటారు. ఇంకా కొందరు వెరైటీ కోసం ఇంటర్‌నెట్‌లో చూసి వినూత్నంగా ఉండేలా పెడతారు. కానీ తాడిపత్రి(Tadipatri)కి చెందిన ఓ టీచర్‌ తన కుమారుడికి అంకెలతో పేరు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: Bangalore: హంపిలో ‘చిరుత’ కలకలం..


తాడిపత్రిలోని సుంకులమ్మపాలెంకు చెందిన రాఘవేంద్ర, ప్రశాంతి దంపతులు తమ కుమారుడికి 126 అంటూ అంకెలతో పేరు పెట్టారు. రాఘవేంద్ర పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆధార్‌ కార్డు, డేట్‌ఆఫ్ బర్త్‌ సర్టిఫికెట్(Aadhaar Card, Date of Birth Certificate), పాఠశాల రికార్డుల్లో కూడా126గా నమో దు చేయించాడు. ఎందుకిలా అని ప్రశ్నిస్తే 126 అంకెల్లో 1 అంటే ఐ, 2 అంటే యామ్‌, 6కి ఇండియన్‌ అని అర్థం వచ్చేలా పెట్టానన్నారు.


కుల, మత బేధాలు ఉండకుండా అందరూ భారతీయులుగా జీవించాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. తన కుమారుడికి ప్రస్తుతం ఆరేళ్ల వయసు ఉన్నా, పుట్టిన కొన్నిరోజులకే 126పేరు పెట్టానని, ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలిపాడు. కుమారుడు పుట్టకమునుపే ఈ పేరు పెట్టాలని ఆలోచించి పెట్టుకున్నానని ఆయన తెలిపారు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 01:53 PM