Anantapur: జగన్ బొమ్మ తీసేయండి...
ABN, Publish Date - Dec 19 , 2024 | 12:44 PM
వైసీపీ పాలనలో భూ సర్వే పేరుతో జగన్(Jagan) బొమ్మతో ముద్రించిన రాళ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసర్వేను ఆపేయడంతోపాటు అపుడు జరిగిన అవకతవకలును సరిదిద్దడానికి రెవెన్యూసదస్సులు నిర్వహిస్తోంది.
- రీ సర్వే రాళ్లపై తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం
- కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అనంతపురం: వైసీపీ పాలనలో భూ సర్వే పేరుతో జగన్(Jagan) బొమ్మతో ముద్రించిన రాళ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసర్వేను ఆపేయడంతోపాటు అపుడు జరిగిన అవకతవకలును సరిదిద్దడానికి రెవెన్యూసదస్సులు నిర్వహిస్తోంది. ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సర్వే రాళ్లపై ఉన్న జగన్ బొమ్మలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు(CM Chandrababu Naidu) ఆదేశించారు.
ఈ వార్తను కూడా చదవండి: Tirupati: అయ్యో.. తల్లి.. ‘అమ్మ’కు ఎంత కష్టం వచ్చిందో..
అనంతలో 2,60,690 రాళ్లకు జగన్ బొమ్మలు..
వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పథకాన్ని 2020లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో భాగంగా జిల్లాలో తొలి విడతగా 198గ్రామాలలో 5,88,615 ఎకరాలలో రీసర్వే చేపట్టారు. ఈగ్రామాలలో రీసర్వే అనంతరం హద్దులలో జగన్ బొమ్మతో కూడిన 2,60,690 రాళ్లను నాటారు. ఈరాళ్లకు ఉన్న జగన్ పేర్లను తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకో వైపు ఆసమయంలో రైతులకు జారీ చేసిన జగన్‌బొమ్మతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దుచేసి, ప్రభుత్వం ముద్రతో రూపొందించిన పుస్తకాలను అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్లు సదస్సులో ముఖ్యమంత్రి ఇదేవిషయంపై ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈమేరకు వాటిన అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
రీసర్వే విషయంలో రాష్ట్రప్రభుత్వ ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటున్నాం, ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చిన విషయం వాస్తవమే. జిల్లా కలెక్టరు, జేసీలు దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం రాళ్లపై ఉన్న జగన్ బొమ్మలు, పేర్లను తొలగించడానికి చర్యలు తీసుకుంటాం.
-రూప్లానాయక్, ఏడీ, సర్వేశాఖ
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 19 , 2024 | 12:52 PM