ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Camphor industry : కర్పూరం పరిశ్రమలో ప్రమాదం

ABN, Publish Date - Nov 02 , 2024 | 12:59 AM

మండల పరిధిలోని కొత్తపల్లి వద్ద ఉన్న సప్తగిరి క్యాంపర్‌ పరిశ్రమలో ఆర్‌-3 రియాక్టర్‌కు మరమ్మతులు చేస్తుండగా విష వాయువులు వెలువడ్డాయి. వెల్డింగ్‌ చేస్తున్న సమయంలో షార్ట్‌ సర్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రియాక్టర్‌ నుంచి వెలువడిన ఐసో బ్రొనైల్‌ అసిటేట్‌ వాయువును పీల్చిన ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది

Police investigating the scene

రియాక్టర్‌ నుంచి విషవాయువులు

ఆరుగురు కార్మికులకు తీవ్ర అస్వస్థత

ఇద్దరి పరిస్థితి విషమం

మరమ్మతులు చేస్తుండగా ఘటన

శింగనమల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కొత్తపల్లి వద్ద ఉన్న సప్తగిరి క్యాంపర్‌ పరిశ్రమలో ఆర్‌-3 రియాక్టర్‌కు మరమ్మతులు చేస్తుండగా విష వాయువులు వెలువడ్డాయి. వెల్డింగ్‌ చేస్తున్న సమయంలో షార్ట్‌ సర్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. రియాక్టర్‌ నుంచి వెలువడిన ఐసో బ్రొనైల్‌ అసిటేట్‌ వాయువును పీల్చిన ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం వారిని


అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితులలో పామిడికి చెందిన కృష్ణ, వడియంపేటకు చెందిన హరి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మణరావు, అనంతపురం నగరానికి చెందిన ఓబులేసు, నాగేంద్ర ప్రసాద్‌, శివరాం ప్రాసాద్‌ ఉన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తోనే..?

ఆరుగురు కార్మికులు ఎప్పటిలాగో శుక్రవారం విధులకు వెళ్లారు. కర్పూరం తయారు చేసే ఆర్‌-3 వద్ద వీరు వారం రోజులుగా మరమ్మతులు పనులు చేస్తున్నారు. ప్రతి పది రోజులకు ఒకసారి ఈ రియాకర్టర్‌ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. దీనికి రంధ్రాలు పడటంతో వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. ఆ సమయంలో ఆక్సిజన సహా అన్ని భద్రతా ప్రమాణాలను కార్మికులు పాటించారని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కసారిగా రియాక్టర్‌ నుంచి వాయువులు వెలువడటంతో కార్మికులు ఊపిరి అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులలో లక్ష్మణ్‌రావు, నాగేంద్ర ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయాలో వెంటిలేషనపై చికిత్స అందిస్తున్నారు. సీఐ కౌలుట్లయ్య సిబ్బందితో ఫ్యాక్టరీని సందర్శించారు. నిర్వాహకులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.

యాజమాన్యం తీరుపై విమర్శలు

ఫ్యాక్టరీలో ఉదయం ప్రమాదం జరిగితే మధ్యాహ్నం వరకూ తమకు సమాచారం ఇవ్వలేదని కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారికి ఏదైనా జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రియాక్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగదని ఫ్యాక్టరీ నిర్వాహకులు, పోలీసులు అంటున్నారు. కర్నూలులోని పొల్యూషన కంట్రోల్‌ బోర్డు అధికారులు ఈ ప్రమాదం గురించి ఆరా తీశారు.

మెరుగైన వైద్యం అందించండి: ఎమ్మెల్యే శ్రావణి

కర్పూరం తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం బాధాకరమని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. బాధితులను హైదరాబాద్‌ లేదా బెంగూరులోని సుపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. కార్మికులకు ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యత వహించాలని, కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 12:59 AM