ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tdp : నేడు మునిసిపాలిటీలో బల ప్రదర్శన

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:11 AM

పురపాలక సంఘం స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయ సలహాదారు నియామకం విషయంగా బుధవారం మునిసిపల్‌ సమావేశంలో టీడీపీ, వైసీపీ మధ్య బల ప్రదర్శన జరగనుంది. గతంలో నియమించిన స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయ సలహాదారుగా జీపీ తిమ్మారెడ్డి రాజీనామా చేయడం తో ఆ పోస్టు నియామకానికి కౌన్సిల్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 13వ తేదీన దరఖాస్తు గడువు ముగియడంతో బుధవారం నిర్వహించేసాధారణ సమావేశంలో ...

Guntakallu Municipality

స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఎంపికలో హైటెన్షన

కీలకం కానున్న సీపీఐ కౌన్సిలరు ఓటు

గుంతకల్లు, ఆగస్టు 27: పురపాలక సంఘం స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయ సలహాదారు నియామకం విషయంగా బుధవారం మునిసిపల్‌ సమావేశంలో టీడీపీ, వైసీపీ మధ్య బల ప్రదర్శన జరగనుంది. గతంలో నియమించిన స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయ సలహాదారుగా జీపీ తిమ్మారెడ్డి రాజీనామా చేయడం తో ఆ పోస్టు నియామకానికి కౌన్సిల్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 13వ తేదీన దరఖాస్తు గడువు ముగియడంతో బుధవారం నిర్వహించేసాధారణ సమావేశంలో ఈ పోస్టు నియామకం చేపట్ట నున్నారు. కౌన్సిల్‌లో వైసీపీ సభ్యులు అధికంగా, టీడీపీ కౌన్సిలర్లు తక్కువగా ఉండేవారు. కానీ గత వారం వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరగా టీడీపీ, వైసీపీ బలాలు


సరిసమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న సీపీఐ కౌన్సిలరు ఓటు కీలకం కానుంది.

టీడీపీకి అనుకూల పరిస్థితులు

గుంతకల్లు మునిసిపాలిటీలో 37 వార్డులుండగా, గత పురపాలక ఎన్నికల్లో వైసీపీకి 29, టీడీపీకి 7, సీపీఐకి 1 స్థానం లభించింది. ఈ పరిస్థితుల్లో రెండున్నర నెలల కిందట ఎన్నికల సందర్భంగా నలుగు రు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అలాగే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గ్రీన సిగ్నల్‌ ఇవ్వడంతో గత వారం ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 18కి పెరిగింది. వైసీపీ నుంచి ఇలా మొత్తం 11 మంది టీడీపీలో చేరడంతో కౌన్సిల్‌లో వైసీపీ బలం 18కి పడిపోయింది. ఎమ్మెల్యే తన ఎక్స్‌ అఫిషియో సభ్యత్వాన్ని గుంతకల్లు పురపాలక సంఘంలోనే నమోదు చేసుకున్నందున టీడీపీ సభ్యుల సంఖ్య 19కి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో సీపీఐకి చెందిన 26వ వార్డు కౌన్సిలరు లక్ష్మి కీలకం కానున్నారు. ఆమె టీడీపీ పక్షాన నిలిచిలినా లేదా గైర్హాజరైనా పదవి టీడీపీకి చెందిన న్యాయవాది కృష్ణారెడ్డికి లభిస్తుంది. ఆమె వైసీపీ వైపు మొగ్గితే మరలా బలాబలాలు సమం అవుతాయి. అయితే వైసీపీకి చెందిన కౌన్సిలర్లు కొందరు గైర్హాజరు కావచ్చని సమాచారం. అలా జరిగితే టీడీపీకి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

పోటీతోనే వైసీపీకి కష్టకాలం

సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం పోయి, టీడీపీ అధికారంలోకి రావడంతో స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయ సలహాదారు పదవిలో ఉన్న తిమ్మారెడ్డి నైతిక బాధ్యతతో రాజీనామా చేశారు. ఖాళీ అయిన పదవికి టీడీపీకి చెందిన న్యాయవాది కృష్ణారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అధికార పార్టీకి చెంది న వ్యక్తి కావడం, ఎమ్మెల్యే సిఫారసు ఉండటంతో ఆయనకే ఆ పదవి వస్తుందని అందరూ భావించారు. కాగా కౌన్సిల్‌లో బలం ఉన్నప్పుడు ఎందుకు వదిలెయ్యాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు న్యాయవాది గోపాల కృష్ణను బరిలోకి దింపారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పోటీలో ఎలాగైనా పంతం నెగ్గించుకోవాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి ఆహ్వానించారు. పోటీలో నిలపకపోయి ఉంటే వైసీపీకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్న చర్చ జరుగుతోంది. కాగా కౌన్సిల్‌లో టీడీపీ బలం పెరిగిపోవడంతో ఇక ప్రయోజనం లేదని న్యాయవాది గోపాల కృష్ణ తన దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కౌన్సిల్‌లో అవసరమైతే హాజరుకావడానికి ఎమ్మెల్యే జయరాం అందుబాటులో ఉండనున్నారు. మొత్తానికి బుధవారం కౌన్సిల్‌ సమావేశం హాట్‌హాట్‌గా నడిచే అవకాశాలు ఉన్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 28 , 2024 | 12:11 AM

Advertising
Advertising
<