PARITALA SRIRAM: ధర్మవరంలో మహిళా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:25 AM
పట్టణ పరిధిలో మహిళా పారిశ్రామిక వాడ, స్టిచ్చింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, ఆర్థికంగా చితికిపోయిన చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్.. పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవితకు విజ్ఞప్తిచేశారు.
ధర్మవరం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలో మహిళా పారిశ్రామిక వాడ, స్టిచ్చింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, ఆర్థికంగా చితికిపోయిన చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్.. పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవితకు విజ్ఞప్తిచేశారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పెనుకొండకు వచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివా్‌సను పరిటాల శ్రీరామ్ కలిసి, ధర్మవరం ప్రాంతంలో చేనేతలు పడుతున్న కష్టాలను వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ధర్మవరం చేనేత రంగం కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. ముడిసరుకుల ధరలు పెరిగి, గిట్టుబాటు ధరలు దక్కక చేనేత రంగం కుదేలైందన్నారు. ధర్మవరం పట్టణంలోనే 50 వేల కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయన్నారు. చేనేత వృత్తిలో కీలకంగా ఉన్న మహిళలకు ప్రస్తుతం ఉపాధి లేకుండాపోయిందన్నారు. వారు ఆర్థిక సాయం అడగకుండా తమకు ఉపాధి చూపించాలని కోరుతున్నారని పరిటాల శ్రీరామ్.. మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 20వేల మందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే దిశగా వారికి ప్రత్యేకంగా పారిశ్రామిక వాడ, స్టిచ్చింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడుతో చర్చిస్తానని పరిటాల శ్రీరామ్‌కు తెలిపారు.
Updated Date - Dec 17 , 2024 | 12:25 AM