మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

DAGGUBATI : జన తరంగం

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:10 AM

టీడీపీ అనంత అర్బన కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ బుధవారం అట్టహాసంగా నామినేషన వేశారు. శ్రీనగర్‌ కాలనీలోని టీడీపీ కార్యాలయం నుంచి వేలాది మందిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి, మత పెద్దలు దగ్గుబాటిని ఆశీర్వదించారు. కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన నామినేషన ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనగర్‌ కాలనీ నుంచి జడ్పీ కార్యాలయం ...

DAGGUBATI : జన తరంగం
Daggubati filing nomination

అర్బనలో టీడీపీ కూటమి

అభ్యర్థి దగ్గుబాటి నామినేషన

వేలాది మందితో నగరంలో ర్యాలీ

హాజరైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, శ్రేణులు

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 24: టీడీపీ అనంత అర్బన కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ బుధవారం అట్టహాసంగా నామినేషన వేశారు. శ్రీనగర్‌ కాలనీలోని టీడీపీ కార్యాలయం నుంచి వేలాది మందిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి, మత పెద్దలు దగ్గుబాటిని ఆశీర్వదించారు. కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన నామినేషన ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనగర్‌ కాలనీ నుంచి జడ్పీ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం దాకా ర్యాలీలో జనం కిక్కిరిసిపోయారు. బాణ సంచా కాలుస్తూ,


పూల వర్షం కురిపిస్తూ, డప్పులు వాయిదాల మధ్య ర్యాలీ కొనసాగింది. జై చంద్రబాబు.. జై దగ్గుబాటి ప్రసాద్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ యువజన అధ్యక్షుడు జస్వంత వ్యాస్‌, జనసేన నగర ప్రధాన కార్యదర్శి ఇమామ్‌ హుస్సేన, బీసీ నాయకులు గజమాలతో దగ్గుబాటి ప్రసాద్‌ను సన్మానించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత ఆర్‌డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటే్‌షకు కూటమి పార్టీల నాయకుల సమక్షంలో ఆయన తన నామినేషనను అందజే శారు.

నా విజయం ఖాయం..

తన నామినేషన మహోత్సవానికి అనూహ్యరీతిలో వేలాది జనం తరలిరావడం సంతోషకరమని దగ్గుబాటి ప్రసాద్‌ అన్నారు. ఈ స్పందన చూసిన తర్వాత ఎన్నికల్లో తన విజయం ఖాయమని తేలిపోయిందని అన్నారు. మెజార్టీ ఎంత వస్తుందని ఆలోచిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ తనను వారి సొంత మనిషిలా భావించి నడిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబునాయుడే తనకు ఆదర్శమని, ఒక్క అవకాశం ఇస్తే చంద్రబాబు సహకారంతో అనంతను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ స్వరూప, టౌన బ్యాంక్‌ చైర్మన జేఎల్‌ మురళీధర్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌, బీజేపీ నాయకుడు లలితకుమార్‌, నాయకులు తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, ప్రకా్‌షనాయుడు, గాజుల ఆదెన్న, గౌస్‌మొద్దీన, సాలార్‌ బాషా, కొండవీటి సుధాకర్‌నాయుడు, రాయల్‌ మురళి, సరిపూటి రమణ, నటేష్‌ చౌదరి, కుంచెపు వెంకటేష్‌, సుధాకర్‌ యాదవ్‌, జయరాంరెడ్డి, స్వామిదాస్‌, నారాయణస్వామి యాదవ్‌, సైఫుద్దీన, పోతుల లక్ష్మీనరసింహులు, పీఎం లక్ష్మీప్రసాద్‌, మారుతీకుమార్‌ గౌడ్‌, రాజారావు, నెట్టెం బాలకృష్ణ, కూచి హరి, కురబ నారాయణస్వామి, గుర్రం నాగభూషణం, కడియాల కొండన్న, గుత్తా ధనుంజయనాయుడు, దగ్గుబాటి శ్రీలక్ష్మీ, కొండవీటి భావన, స్వప్న, విజయశ్రీరెడ్డి, సంగా తేజస్విని, బల్లా పల్లవి, సరళ, లక్ష్మీనాయుడమ్మ, వడ్డే భవాని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 12:11 AM

Advertising
Advertising