ANGANWADI : అర్ధంతరంగా అంగనవాడీ భవనాలు
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:08 AM
గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ... చిన్నారులకు ప్రాథమిక విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు అర్థంతరంగానే నిలిచిపోయాయి. సకాలంలో బిల్లులు కాలేదని కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపి వేశా రు.
రాప్తాడు, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ... చిన్నారులకు ప్రాథమిక విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు అర్థంతరంగానే నిలిచిపోయాయి. సకాలంలో బిల్లులు కాలేదని కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపి వేశా రు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రజా ప్రతినిధు లు, అధికారులు పట్టించుకోకపోవడంతో మండలంలోని కొన్ని అంగనవాడీ భవనాలు పిల్లర్ల దశలో ఉండి దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా అంగన వాడీ భవనాలను గ్రామంలోని ఇతర ప్రభుత్వ భవనా ల్లో నిర్వహిస్తున్నారు.
పిల్లర్ల దశలోనే ...
మండలంలోని హంపాపురం, అయ్యవారిపల్లి, బండ మీదపల్లి గ్రామాల్లో గత వైసీపీ ప్రభుత్వం 2021లో అంగనవాడీ కేంద్రాల భవనాలకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనాన్ని దాదాపు రూ. 8 లక్షలతో ని ర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో అప్పటి వైసీపీ నాయకు లే కాంట్రాక్టు దక్కించుకుని, ప నులు ప్రారంభించారు. హంపాపు రంలో పిల్లర్లు వేసి ఆరు అడుగు ల గోడ కట్టారు. చేసిన పనులకు దాదాపు రూ. 2 లక్షల వరకు బిల్లు కాంట్రాక్టరు ఖాతాలో జమ అయింది. ఆ తరువాత పనులు నిలిపి వేశారు. దీంతో భవనంలో కేంద్రం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. హంపాపురంలోని మరో అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రాథమిక పాఠశాల భవనంలోని ఓ గదిలో నిర్వహి స్తున్నారు. అయ్యవారిపల్లిలోని ప్రాఽథమిక పాఠశాల ఆవరణంలో అంగనవాడీ నూతన భవనం నిర్మాణం ప్రారంభించి, మధ్యలోనే నిలిపివేశారు. సొంత భవనం లేక చిన్నారులు, అంగనవాడీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. బండమీదపల్లిలో నూతన భవనం పనులు 80 శాతం పూర్తి చేసి నిలిపివేయడంతో ఆ భవనం నిరుపయోగంగా ఉంది. సొంత భవనం లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. గత వైసీపీ పాల కులు, అధికారులు అంగనవాడీ భవనాల నిర్మాణం పట్ల శ్రద్ధ చూపకపోవడంతో పూర్తి కాలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిలిచిపోయిన అంగన్వాడీ భవన నిర్మాణాలు పూర్తవు తాయని ఆయా గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. గత టీడీపీ హయాంలో పరిటాల సునీత మంత్రిగా ఉన్న ప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో అనేక నూతన అం గనవాడీ భవన నిర్మాణాలు పూర్తి చేయించారు. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో మధ్యలో నిలిచి పోయిన భవనాలును ఎమ్మెల్యే పూర్తి చేయిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
అంగనవాడీ భవన నిర్మాణాల పరిస్థితిని ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లామని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు హేమలత, నాగరత్న తెలిపారు. సొంత భవనాలు లేకపోవడంతో ఆయా గ్రామాల్లో ప్రస్తుతం ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాల్లో అంగనవాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
Updated Date - Dec 15 , 2024 | 01:08 AM