FESTIVALS : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:21 AM
కలియుగదైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాలకు గురువారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. స్థానిక ఆర్‌ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివార ్లకు విశేష పూజలు నిర్వహించారు. అంకురార్పణ, పవిత్ర గరుడ పతా కావిష్కరణ, అమ్మవార్లు స్వామి మూలవిరాట్‌లకు వివిధ అభిషేకా లు, కుంకుమార్చనలు, తోమాలసేవ, అలంకారసేవ నిర్వహించారు.
అనంతపురం కల్చరల్, అక్టోబరు 3: కలియుగదైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాలకు గురువారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. స్థానిక ఆర్‌ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివార ్లకు విశేష పూజలు నిర్వహించారు. అంకురార్పణ, పవిత్ర గరుడ పతా కావిష్కరణ, అమ్మవార్లు స్వామి మూలవిరాట్‌లకు వివిధ అభిషేకా లు, కుంకుమార్చనలు, తోమాలసేవ, అలంకారసేవ నిర్వహించారు. మహామంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం వివిధరకాల పుష్పాలతో అలంకరించిన శేషవా హనంపై శ్రీవారిని ఆశీనులను చేసి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యవర్గం, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 04 , 2024 | 12:21 AM