ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRIDGES : బ్రిడ్జిల నిర్మాణానికి ఆమోదం

ABN, Publish Date - Sep 15 , 2024 | 12:47 AM

రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజక వర్గాల్లోని ప్రజలకు, ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి కొన్నేళ్లుగా నెలకొన్న ప్రయాణ కష్టాలు త్వరలో తీర నున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రోడ్లన్నీ చాలా అధ్వానస్థితికి చేరుకుని ప్రజ లు చాలా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా జిల్లాలో హెచ్చెల్సీపై కణేకల్లు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది.

Dilapidated Kanekallu Bridge

అనంతపురం, సిటి, సెప్టెంబరు 14 : రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజక వర్గాల్లోని ప్రజలకు, ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి కొన్నేళ్లుగా నెలకొన్న ప్రయాణ కష్టాలు త్వరలో తీర నున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రోడ్లన్నీ చాలా అధ్వానస్థితికి చేరుకుని ప్రజ లు చాలా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా జిల్లాలో హెచ్చెల్సీపై కణేకల్లు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. బెళుగుప్ప మండలం రామసాగరం వద్ద పెన్నా నదిపై బ్రిడ్జి లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవా రు.


ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసుల చొరవతో ఆ రెండు బ్రిడ్జిల నిర్మాణానికి ఆమోదం లభించినట్లు తెలిసింది. ఉరవకొండ, కణేకల్లు ప్రధాన రహదారిలో హెచ్చెల్సీపై కణేకల్లు వద్ద నిర్మించిన బ్రిడ్జి పూర్తి శిధిలావస్థకు చేరడంతో అధికారులు రాక పోకలు ఆపేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ఎనడీబీ (న్యూ డెవ లప్‌మెంట్‌ బ్యాంకు) కింద రూ. 40 కోట్లతో శ్రీకారం చుట్టింది. తాడిపత్రికి చెందిన ఓ సంస్థకు టెండర్‌ దక్కినా పనులు జరుగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కాలవ చొరవతో కణేకల్లు బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే ఉరవకొండ ఎ మ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ చొరవతో కూడేరు, రామసాగరం రోడ్డుపై రామసాగరం వద్ద పెన్నా నదిపైౖ హైలెవల్‌ వంతెన (బ్రిడ్జి) నిర్మాణానికి రూ. 90 కోట్ల నిధులతో ప్రభుత్వానికి నివేదిక పెట్టిం చారు. త్వరలోనే పనులు జరగనున్నాయి. ఆ రెండు బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి ఆర్‌అండ్‌ బీ ఈఎనసీ నయీముల్లా ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 15 , 2024 | 12:47 AM

Advertising
Advertising