ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tunga Bhadra : క్రస్ట్‌ గేట్లు భద్రమేనా..?

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:07 AM

తుంగభద్ర ప్రాజెక్టును ఈ నెల 9, 10 తేదీలలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎ్‌సఏ) నియమించిన నిపుణుల కమిటీ సందర్శించనుంది. గత నెల 10న చైన లింగ్‌ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్‌గేట్‌తో పాటుగా మిగిలిన 32 క్రస్ట్‌గేట్ల భద్రత, ఇతర అంశాల అధ్యయనం కోసం ఈ బృందం వస్తోంది. జాతీయ జలాశయాలు భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన ఏకే బజాజ్‌ నేతృత్వంలో ఢిల్లీకి చెందిన రిటైర్డ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు హర్కేశ ...

Tunga Bhadra dam

పరిశీలనకు నిపుణుల కమిటీ

9న తుంగభద్ర డ్యాం వద్దకు..

కర్నూలు, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ప్రాజెక్టును ఈ నెల 9, 10 తేదీలలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎ్‌సఏ) నియమించిన నిపుణుల కమిటీ సందర్శించనుంది. గత నెల 10న చైన లింగ్‌ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్‌గేట్‌తో పాటుగా మిగిలిన 32 క్రస్ట్‌గేట్ల భద్రత, ఇతర అంశాల అధ్యయనం కోసం ఈ బృందం వస్తోంది. జాతీయ జలాశయాలు భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన ఏకే బజాజ్‌ నేతృత్వంలో ఢిల్లీకి చెందిన రిటైర్డ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు హర్కేశ కుమార్‌, జాతీయ, అంతర్జాతీయ సాగునీటి ప్రాజెక్టుల కోసం పని చేసిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు తారాపురం సుధాకర్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ ప్రభుత్వాలు ఎంపిక చేసే ఇంజనీరింగ్‌ ప్రతినిధులు ఇందులో ఉన్నారు. ఏకే బజాజ్‌, హర్కేశకుమార్‌, తారాపురం


సుధాకర్‌కు హైడ్రో-మెకానికల్‌, ఎలకి్ట్రకల్‌ సిస్టమ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌లుగా వివిధ అధ్యయన కమిటీల్లో పని చేసిన అనుభవం ఉంది. తుంగభద్ర డ్యాంకు వరద దగ్గడంతో ఆగస్టు 10న రాత్రి ఎత్తిన క్రస్ట్‌గేట్లు దింపుతుండగా చైన లింక్‌ తెగిపోవడంతో 19వ గేటు కొట్టుకుపోయిందని టీబీపీ బోర్డు అధికారులు అంటున్నారు. చైనలింక్‌ తెగిపోయినా క్రస్ట్‌గేట్‌ గ్రూవ్‌ (గాడి) నుంచి విడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోవడం అనుమానాలకు తావిస్తుంది. కన్నయ్యనాయుడు నేతృత్వంలో క్రస్ట్‌గేట్‌ స్థానంలో స్టాప్‌లాగ్‌ను అమర్చారు. అయితే.. గేటు ఎలా కొట్టుకుపోయింది..? మిగిలిన గేట్లు ఎంతవరకు భద్రం..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ సందేహాల నివృత్తి కోసం నిపుణుల కమిటీ వస్తోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందు, తరువాత క్రస్ట్‌గేట్ల తనిఖీ, మరమ్మతుల వివరాలు, డ్యాం డిజైన, హైడ్రో మెకానికల్‌, ఎలకి్ట్రకల్‌ వివరాలు కావాలని బోర్డు అధికారులను నిపుణుల కమిటీ కోరినట్లు సమాచారం. ఈ మేరకు టీబీపీ బోర్డు అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారని తెలిసింది.

టీబీడ్యాంలో 101.7 టీఎంసీల నీటి నిల్వ

తుంగభద్ర డ్యాంలో శుక్రవారం 101.773 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. డ్యాంలోకి 32347 క్యూసెక్కుల ఇనఫ్లో, 33439 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు జలాశయం అధికారులు వెల్లడించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 07 , 2024 | 12:07 AM

Advertising
Advertising