Deo Office : నాగరాజుకే.. జై..!
ABN, Publish Date - Dec 14 , 2024 | 12:38 AM
విద్యాశాఖలో ఇష్టారాజ్యం నడుస్తోంది. అనర్హులకు పట్ట కట్టడం పరిపాటిగా మారింది. ఏఎ్‌సఓ పోస్టు భర్తీ వ్యవహారంలో ఇది మరోమారు రుజువైంది. డీఈఓ ఆఫీ్‌సలో అత్యంత కీలకమైన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎ్‌సఓ) పోస్టును అనర్హుడికి కట్టబెట్టారు. వైసీపీ హయాంలో ఏపీఓగా వచ్చిన నాగరాజుకు ఆ పోస్టును రాసిచ్చేశారు. అనంతపురం ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుపై చర్యలు లేకపోగా.. అందలం ఎక్కించారు. మూడేళ్లుగా ఏపీఓగా అక్కడే పనిచేస్తున్న ఆయనకు నామినేటెడ్ పోస్టు తరహాలో...
అర్హత లేకున్నా ఏఎ్‌సఓ పోస్టు..
ఎమ్మెల్యే, సంఘాల ఫిర్యాదును కాదని..
విద్యాశాఖలో మరో అడ్డగోలు నిర్ణయం
డీఈఓపై ఒత్తిళ్లు ఉన్నాయని ప్రచారం
అనంతపురం విద్య, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో ఇష్టారాజ్యం నడుస్తోంది. అనర్హులకు పట్ట కట్టడం పరిపాటిగా మారింది. ఏఎ్‌సఓ పోస్టు భర్తీ వ్యవహారంలో ఇది మరోమారు రుజువైంది. డీఈఓ ఆఫీ్‌సలో అత్యంత కీలకమైన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎ్‌సఓ) పోస్టును అనర్హుడికి కట్టబెట్టారు. వైసీపీ హయాంలో ఏపీఓగా వచ్చిన నాగరాజుకు ఆ పోస్టును రాసిచ్చేశారు. అనంతపురం ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుపై చర్యలు లేకపోగా.. అందలం ఎక్కించారు. మూడేళ్లుగా ఏపీఓగా అక్కడే పనిచేస్తున్న ఆయనకు నామినేటెడ్ పోస్టు తరహాలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఏఎ్‌సఓ పోస్టును కట్టబెట్టారు. విద్యాశాఖ ఏడీలు, సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది, ఉపాధ్యాయవర్గాలు వ్యతిరేకిస్తున్నా డీఈఓ ప్రసాద్‌బాబు అటువైపే మొగ్గుచూపడం విమర్శలకు తావిస్తోంది. డీఈఓ నిర్ణయంపై విద్యాశాఖ మంత్రి లోకేశ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సంఘాల నేతలు సిద్ధమయ్యారు.
ఒత్తిడి నిజమేనా..?
నాగరాజును ఏఎ్‌సఓ పోస్టు ఇవ్వడం వెనుక ఉన్నతాధికారుల ఒత్తిడి ఉందని బయటకు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్‌తోపాటు, ఆర్‌జేడీ శామ్యూల్ నుంచి ఒత్తిళ్లు ఉండటం వల్లే డీఈఓ ప్రసాద్‌బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఒత్తిడి నిజమే అనుకున్నా, అర్హత లేనివారికి కీలక పోస్టు ఎలా ఇస్తారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో గణితం స్కూల్ అసిస్టెంట్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న టీచర్లు వందలాది మంది ఉన్నారు. వారందరినీ కాదని, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు అన్న నెపంతో అనర్హుడికి ఇవ్వడం ఏమిటని మండిపపడుతున్నారు. ఇప్పటికే నాగరాజుపై అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ‘ఉపాధ్యాయుల సర్దుబాటులో మిగులు ఉపాధ్యాయులకు మంచి స్థానాలు కావాలంటే నన్ను కలవండి. మంచి ప్లేస్ ఇప్పిస్తా అని ఏపీఓ నాగరాజు ప్రలోభ పెట్టారు. కొందరు ఉపాధ్యాయుల నుంచి డబ్బులు తీసుకుని మోసగించినట్లు నా దృష్టికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకోండి..’ అని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. మరికొందరు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు సైతం ఫిర్యాదు చేశారు. ఇవేవీ పనిచేయలేదు. విద్యాశాఖ అధికారులు తాము అనుకున్న పని చేసేశారు.
ఎందుకంత ప్రేమ..?
జిల్లా విద్యాశాఖలో ఏఎ్‌సఓ పోస్టు కీలకం. శాఖ మొత్తం సమాచారం తెప్పించడం, విద్యాశాఖ కమిషనర్ నివేదించడంలో ఏఎ్‌సఓ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. టీచర్ల బదిలీలు, సర్దుబాటు, ప్రమోషన్లు.. ఇలా ప్రతి అంశంలో ఏఎ్‌సఓ పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ పోస్టుకు సహజంగా గణితం స్కూల్ అసిస్టెంట్స్‌ను తీసుకుంటారు. దీంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఫిజికల్ సైన్స టీచర్ అయిన నాగరాజుకు కట్టబెట్టారు. పైరవీకారులకు ప్రాధాన్యం ఇవ్వడం విద్యాశాఖలో పరిపాటిగా మారింది. కొత్త ఏపీఓగా ఎస్‌జీటీ మంజునాథ్‌ను నియమించారు. ఇటీవలి వరకూ డీఈఓ ఆఫీ్‌సలో ఏఎ్‌సఓగా పనిచేస్తున్న ఓబులరెడ్డిని కళ్యాణదుర్గం నార్త్ స్కూల్‌కు రీప్యాట్రియేషన చేశారు. ఆ పోస్టు ఖాళీ పడటంతో వైసీపీ హయాంలో వచ్చిన ఏపీఓ నాగరాజుకు కట్టబెట్టారు. గతంలో ఆయనకు ఏపీఓ పోస్టు ఇవ్వడాన్నే అందరూ తప్పుబట్టారు. ఎస్‌జీటీని నియమించే ఏపీఓ పోస్టులోకి అప్పటి డీఈఓ శామ్యూల్ (ప్రస్తుత ఆర్‌జేడీ) స్కూల్ అసిస్టెంట్ నాగరాజును తీసుకువచ్చారు. వైసీపీ హయాంలో తీసుకున్న ఈ నిర్ణయం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే వ్యక్తికి అత్యంతకీలకమైన ఏఎస్‌ఓ పోస్టు కట్టబెడ్డం గమనార్హం.
ఫిర్యాదుకు సిద్ధం
జిల్లా విద్యాశాఖ అధికారి తీసుకున్న నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి నారా లోకోశ, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన నాగరాజు అనర్హుడని, అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వంలోనూ అవకాశం ఇవ్వడం సరికాదని వారు అంటున్నారు. ఏఎ్‌సఓ పోస్టు నియామకం దుమారం రేపుతుండటంతో డీఈఓ ప్రసాద్ బాబును వివరణ కోరేందుకు ఆంధ్రజ్యోతి ఫోన చేసింది. ఆయన అందుబాటులోకి రాలేదు.
Updated Date - Dec 14 , 2024 | 12:38 AM