Little Flower School : కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్‌పై దాడి
ABN, Publish Date - Aug 03 , 2024 | 12:15 AM
నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్‌పై ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు శుక్రవారం దాడి చేశారు. అదే పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న తమ చిన్నారులపై ఆయన కొన్నాళ్లుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆయనపై ఈ తరహా ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆంజనేయులు గౌడ్ వయసు 77 ఏళ్లు. విద్యాసంస్థల నిర్వహణతోపాటు సాహితీ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన నగరవాసులకు సుపరిచితులు. ఆయనపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న టూటౌన పోలీసులు వెంటనే పాఠశాలకు వెళ్లారు. నాలుగు, ఐదో ...
బాలికలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు
అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు
విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారుల విచారణ
పాఠశాల మూసివేత.. విద్యార్థులు ఇళ్లకు..
ఇదంతా ఎవరో చేయిస్తున్నారు : గౌడ్ కుటుంబం
అనంతపురం విద్య, ఆగస్టు 2: నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్‌పై ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు శుక్రవారం దాడి చేశారు. అదే పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న తమ చిన్నారులపై ఆయన కొన్నాళ్లుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆయనపై ఈ తరహా ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆంజనేయులు గౌడ్ వయసు 77 ఏళ్లు. విద్యాసంస్థల నిర్వహణతోపాటు సాహితీ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన నగరవాసులకు సుపరిచితులు. ఆయనపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న టూటౌన పోలీసులు వెంటనే పాఠశాలకు వెళ్లారు. నాలుగు, ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై ఆయన లైంగిక దాడికి యత్నించారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషనకు తరలించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ
విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ టీవీవీ ప్రతాప్ తెలిపారు. కాగా, డబ్బుల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆంజనేయులు గౌడ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
నెలన్నర క్రితం చేరారు..
నగరానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు తమ కూతుళ్లను నెలన్నర క్రితం లిటిల్ ఫ్లవర్ స్కూల్ హాస్టల్‌లో చేర్పించారు. ఆ ఇద్దరు మహిళలు తమ బంధువులతో కలిసి శుక్రవారం ఉదయం పాఠశాలకు చేరుకుని అనూహ్యంగా కరస్పాండెంట్‌పై దాడి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఉదయం స్కూల్ వద్దకు వచ్చాం. పాప చేతిలో రూ.100 కనిపించడంతో ఎక్కడివి అని అడిగాము. కరస్పాండెంట్ ఇచ్చాడని చెప్పారు. కడుపు నొప్పిస్తోందని కూడా చెప్పడంతో గట్టిగా అడిగాము. తమ కరస్పాండెంట్ గదికిలోకి పిలిచి రెండు వారాలుగా బట్టలు విప్పి లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పారు. ఎవరికీ చెప్పొద్దని డబ్బులు ఇచ్చాడని చెప్పారు. విషయం బయటకు చెప్పవద్దని బెదిరిస్తూ వారి తొడపై, చెంపపై కొట్టాడు. ఆయనను శిక్షించాలి. మాకు న్యాయం చేయాలి..’ అని అన్నారు.
ఉద్దేశపూర్వకంగానే..
మూడు దశాబ్దాలకు పైగా తాము పాఠశాలను నిర్వహిస్తున్నామని, వేలాది మంది తమ పాఠశాలలో చదువుకున్నారని ఆంజనేయులు గౌడ్ కుమారుడు దేవేంద్రగౌడ్, కోడలు సరిత, తమ్ముడి కుమారుడు రాజేంద్రగౌడ్ అన్నారు. ఆయన ఎందరికో సాయం చేశారని, ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇరికించారని అన్నారు. తమకు కొందరిపై అనుమానాలున్నాయని, డబ్బుల కోసం, తమ పాఠశాల స్థలం కోసం ఇదంతా చేశారని అనుమానం కలుగుతోందని అన్నారు. త్వరలోనే పూర్తి సమాచారంతో మీడియా ముందుకు వస్తామని, తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
అధికారుల విచారణ...
లైంగిక వేధింపుల గొడవ విషయం తెలుసుకున్న డీఈఓ వరలక్ష్మి, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు, ఎంఈఓ వెంకటస్వామి, లీగల్ అండ్ ప్రొటెక్షన ఆఫీసర్ సంధ్యారాణి, ఐసీడీఎస్ అధికారులు టూటౌన పోలీస్ స్టేషనకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు సూచించామని డీఈఓ తెలిపారు.
పాఠశాల మూసివేత
విదాదం నేపథ్యంలో విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు పాఠశాలను సందర్శించారు. తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. హాస్టల్‌లో ఉంటున్న సుమారు పాతిక మంది విద్యార్థులను కూడా ఇళ్లకు పంపించి, పాఠశాలను మూసివేయించారు. పాఠశాలను సీజ్ చేసి, ఇక్కడి విద్యార్థులను వేరే పాఠశాలలలో చేర్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్ నివేదించినట్లు తెలిసింది.
సమగ్రంగా విచారించాలి: ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం అర్బన: ఆంజినేయులు గౌడ్‌పై వచ్చిన ఆరోపణల గురించి సమగ్రంగా విచారించాలని పోలీసులు, విద్యా శాఖ అధికారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవాలని, ఎక్కడా రాజీపడొద్దని సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 03 , 2024 | 12:16 AM