ELECTION BETTING : పందెమా.. వద్దులేప్పా..!
ABN, Publish Date - May 17 , 2024 | 12:31 AM
వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు ఉన్న జోష్ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...
కూటమిదే అధికారమట..
డబ్బులెందుకు పోగొట్టుకోవాలి..
వైసీపీపై బెట్టింగ్‌కు జంకుతున్న పందెంరాయుళ్లు
వైసీపీ అభ్యర్థుల్లో కనిపించని మునుపటి జోష్
అనంతపురం, మే 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు ఉన్న జోష్ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు, దౌర్జన్యాలు వైసీపీని వెంటాడుతున్నాయి. బటన నొక్కుడు తప్ప ఐదేళ్లలో కరువు జిల్లా అభివృద్ధి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ ప్రభావం ఓటింగ్‌పై పడిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా చూసినా కూటమిదే అధికారమనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో వైసీపీ అభ్యర్థుల గెలుపుపైగాని, వైసీపీదే అధికారమనే అంశంపైగాని బెట్టింగ్ కాసేందుకు పందెంరాయుళ్లు జంకుతున్నారు. ‘వైసీపీపై పందెమా... వద్దులేప్పా..’ అంటున్నారు. కూటమిదే అధికారమట.. డబ్బులెందుకు పోగొట్టుకోవాలి అని
జంకుతున్నారని సమాచారం.
కనిపించని ఉత్సాహం...
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతారని, రాష్ట్రంలో వైసీపీదే అధికారమని భారీగా పందేలు కాశారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై రూ.కోట్లలో బెట్టింగ్ కట్టారు. అనంతపురం నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి మెజార్టీపైనే రూ.కోటి పందెంకాసి గెలుపొందాడు. రామ్‌నగర్‌లో కొందరు వ్యాపారులకు వైసీపీపై బెట్టింగ్ కాసేవారికి సవాల్ విసిరారు. ఎన్ని కోట్లయినా పందేనికి రెడీ అని రెచ్చగొట్టారు. తాడిపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల గెలుపు, వైసీపీదే అధికారం అనే అంశంపై రూ.200 కోట్ల దాకా పందేలు కాశారు. ఈ ఎన్నికల్లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదని సమాచారం. జిల్లాలోని రాప్తాడు, అనంతపురం అర్బన, కళ్యాణదుర్గం, గుంతకల్లు, రాయదుర్గం, ఉరవకొండ, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారనిగాని, వైసీపీ మరోమారు అధికారంలోకి వస్తుందనిగాని పందెంకాసేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారని అంటున్నారు. గతంలో రూ.కోట్లలో పందెంకాసినవారు రూ.5 లక్షలు, రూ.10 లక్షలతో సరిపెట్టుకుంటున్నారని సమాచారం. రాష్ట్రంలో కూటమిదే అధికారమని గత సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పందెంకాసి పోగొట్టుకున్నవారు ఈసారి కాలుదువ్వుతున్నారు. ఎంతైనా సరే అని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాదని, జిల్లాలో మెజార్టీ స్థానాలు కూటమికే దక్కుతాయని పందెంకాసేందుకు పోటీ పడుతున్నారు.
వైసీపీ అభ్యర్థులు డీలా...
రాష్ట్రంలో కూటమిదే అధికారమని సర్వేలు చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల నుంచి ఇదే అభిప్రాయం స్పష్టంగా వెలువడుతోంది. ఇది వైసీపీ అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు రోజురోజుకు డీలా పడుతున్నారు. పోలింగ్ జరిగిన తీరు, ఓటు హక్కును అత్యధికంగా వినియోగించుకున్న వివిధ వర్గాల సంఖ్య, గ్రామాల్లో బూతస్థాయిలో పోలింగ్ జరిగిన తీరు, ఓటర్ల మనోగతం.. ఇవన్నీ అధికార పార్టీకి వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థులు ప్రతిరోజూ సమీక్షిస్తూ... లెక్కలేసుకుంటున్నా.. వారిలో నమ్మకం కుదరలేదని సమాచారం. గెలుస్తామనే ధీమా వారు వ్యక్తం చేయలేని పరిస్థతిలో ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 17 , 2024 | 12:31 AM