TDP : ఐదు సంతకాల సంబరం
ABN, Publish Date - Jun 16 , 2024 | 12:03 AM
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఐదు హామీల అమలుకు చంద్రబాబు సంతకాలు చేయడంతో టీడీపీ జిల్లా కార్యాలయంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తదితరులు చంద్రబాబు చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. వృద్ధులు, మహిళలకు స్వీట్లు తినిపించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కూటమి ఘన విజయం సాధించి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఏపీ ...
టీడీపీ జిల్లా కార్యాలయంలో
చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం
అనంతపురం అర్బన, జూన 15: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఐదు హామీల అమలుకు చంద్రబాబు సంతకాలు చేయడంతో టీడీపీ జిల్లా కార్యాలయంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తదితరులు చంద్రబాబు చిత్రపటానికి శనివారం క్షీరాభిషేకం చేశారు. వృద్ధులు, మహిళలకు స్వీట్లు తినిపించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కూటమి ఘన విజయం సాధించి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఏపీ
ప్రజలకు పండుగ వచ్చిందని నాయకులు అన్నారు. ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీల అమలు ఫైల్‌పై సంతకాలు చేశారని అన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై పెట్టి యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని అన్నారు. పింఛన్ల పెంపు, అన్న క్యాంటినల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, యువతలో నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేయడం శుభపరిణామమని అన్నారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటినల ద్వారా పేదలకు రూ.5కు భోజనం దొరికేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని మూసివేయించి పేదల కడుపుకొట్టారని విమర్శించారు. చంద్రన్న చల్లని పాలనలో తిరిగి పేదలకు రూ.5లకే భోజనం అందిస్తామని అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 16 , 2024 | 12:03 AM