COLLECTOR : ఈవీఎంల గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Jul 25 , 2024 | 12:06 AM
నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఈవీఎంల గోడౌనతో పాటు జేఎనటీయూలోని ఈవీఎం గోడౌన్లను బుధవారం జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ పరిశీలించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను కలెక్టర్ పరిశీలిం చారు.
అనంతపురం క్లాక్‌టవర్, జూలై 24: నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఈవీఎంల గోడౌనతో పాటు జేఎనటీయూలోని ఈవీఎం గోడౌన్లను బుధవారం జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ పరిశీలించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను కలెక్టర్ పరిశీలిం చారు.
నాయకుల సమక్షంలో గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎం యంత్రా లు, భద్రతా చర్యలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రామ కృష్ణారెడ్డి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, డీటీ దివాకర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పురాతన కట్టడాలను పరిరక్షించాలి : కలెక్టర్
అనంతపురంరూరల్/కల్చరల్: పురాతన కట్టడాలను పరిరక్షించేం దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం భవనాన్ని, జిల్లా జైలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పురాతమైన పాత ఆర్డీఓ కార్యాలయా న్ని, జిల్లా జైలును అభివృద్ధి చేసి, టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పురాతనమైన భవనాల ను కాపాడుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈకార్యక్రమంలో అనంతపురం తహసీల్దార్ శివరామిరెడ్డి, సర్వేయర్ ప్రతాప్‌రెడ్డి, ఆర్‌ఐ సందీప్‌కుమార్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....