ICDS : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:09 AM
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసీడీఎస్ పీడీ నాగమల్లేశ్వరి పేర్కొన్నారు. తెలిపారు. పౌష్టికా హార మాసోత్సవాలను బుధవారం మెళవాయి పంచాయతీ కేంద్రంలో ని అంగనవాడీ కేంద్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పీడీ మా ట్లాడుతూ... గర్భణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అంగనవాడీ కార్యకర్తలకు సూచించారు.
ఐసీడీఎస్ అధికారులు
మడకశిర రూరల్, సెప్టెంబరు 4 : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసీడీఎస్ పీడీ నాగమల్లేశ్వరి పేర్కొన్నారు. తెలిపారు. పౌష్టికా హార మాసోత్సవాలను బుధవారం మెళవాయి పంచాయతీ కేంద్రంలో ని అంగనవాడీ కేంద్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పీడీ మా ట్లాడుతూ... గర్భణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అంగనవాడీ కార్యకర్తలకు సూచించారు. పౌష్టికాహారంతో పాటు కూరగాయలను కూడా బాగా తీసుకోవాలన్నారు. అందువల్ల కలిగే లాభాలను గురించి వివరించారు. ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ లీలావ తి, అంగనవాడీ కార్యకర్తలు, గర్భిణులు,బాలింతలు పాల్గొన్నారు.
పెనుకొండ రూరల్: మండలకేంద్రంలోని అంగనవాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ శాంతలక్షి బుధవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీడీపీఓ మాట్లాడుతూ... అంగనవాడీ కేంద్రాలద్వారా లభించే పోషకాహారం క్రమం తప్పకుండా వాడాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు జంక్ ఫుడ్ పెట్టకూడదని కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు వాడాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ పుష్ప, యర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : పౌష్టికాహారం తినడంవల్ల రక్తహీనత దరిచేరదని గర్భిణు లు, బాలింతలకు సీడీపీఓ శాంతలక్ష్మి సూచించారు. పట్టణంలోని ఎగువగడ్డ అంగనవాడీ కేంద్రంలో బుధవారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సీడీపీఓ మాట్లాడుతూ అంగనవాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారాన్ని తింటే చిన్నారులకు మంచిదన్నారు. అనంత రం ఇద్దరు చిన్నారులకు అన్న ప్రాసన, ఇద్దరు గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌లు పుష్ప, శ్యామల, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మడకశిరటౌన : ఆకుకూరలు, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల ఆరో గ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శంకరమ్మ అన్నారు. పట్టణం లోని తొమ్మిదో వార్డు అంగనవాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో అంగనవాడీ కార్యకర్త శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 05 , 2024 | 12:09 AM