UTF : ముగిసిన యూటీఎఫ్ క్రీడాపోటీలు
ABN, Publish Date - Sep 30 , 2024 | 12:03 AM
యూటీఎఫ్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపులో భా గంగా నగరంలోని శారద స్కూల్ లో మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. అంతకు ముందు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ...యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉపాధ్యాయుల శ్రేయస్సే పరమావధి గా పోరాటాలు చేస్తోందన్నారు.
అనంతపురం విద్య, సెప్టెంబరు 29 : యూటీఎఫ్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపులో భా గంగా నగరంలోని శారద స్కూల్ లో మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. అంతకు ముందు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ...యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉపాధ్యాయుల శ్రేయస్సే పరమావధి గా పోరాటాలు చేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటంలో ఎన్నో క్రియాశీల, సమరశీల ఉద్య మాలు సాగించిందన్నారు. ఉపాధ్యాయుల కోసమే కాకుండా విద్యాభివృద్ధికి, విద్యార్థుల శ్రేయస్సుకు సామాజిక దృక్పథంతో పనిచేసే సంఘంగా ముద్ర వేసుకుందని పేర్కొన్నారు. అనంతరం చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప, గౌర వాధ్యక్షుడు రమణయ్య, సహాధ్యక్షులు రామప్ప, సరళ, ఇతర నేతలు ప్రమీ ళ, సంజీవ్‌కుమార్, శేఖర్, సుబ్బరాయుడు, దేవేంద్రమ్మ, చంద్ర మోహన, శ్రీనివాసులు, ఆదిశేషయ్య, రఘు, నాగరాజు, నాగేంద్ర, లక్ష్మిదేవి, నాగేంద్ర కుమార్, రాజశేఖర్, విరూపాక్ష, సాలెంబాబు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 30 , 2024 | 12:03 AM