ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Peanut : ఎండిన ఆశలు

ABN, Publish Date - Sep 29 , 2024 | 12:27 AM

ఖరీ్‌ఫలో వేరుశనగ సాగు చేసిన రైతులను నష్టాల భయం వెంటాడుతోంది. వర్షాభావం కారణంగా పంట ఎండిపోయింది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల్లో పదును వర్షం కురవకపోతే పశుగ్రాసం కూడా దక్కదని అంటున్నారు. రాప్తాడు మండల వ్యాప్తంగా 33 వేల ఎకరాల సాగు భూమి ఉంది. జూన, జూలైలో కురిసిన వర్షాలకు, బోరు బావుల కింద 4,350 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. వర్షాధారం కింద సాగు ...

Dried peanuts at Raptadu

వేరుశనగ రైతుకు నష్టాల మూట

వర్షాభావంతో దారుణంగా దెబ్బతిన్న పంట

వారంలోగా వానొస్తే.. పశుగ్రాసం దక్కుతుంది

రాప్తాడు, సెప్టెంబరు 28:

ఖరీ్‌ఫలో వేరుశనగ సాగు చేసిన రైతులను నష్టాల భయం వెంటాడుతోంది. వర్షాభావం కారణంగా పంట ఎండిపోయింది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల్లో పదును వర్షం కురవకపోతే పశుగ్రాసం కూడా దక్కదని అంటున్నారు. రాప్తాడు మండల వ్యాప్తంగా 33 వేల ఎకరాల సాగు భూమి ఉంది. జూన, జూలైలో కురిసిన వర్షాలకు, బోరు బావుల కింద 4,350 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. వర్షాధారం కింద సాగు చేసిన వేరుశనగలో ఎదుగుదల లేదు. విత్తనం వేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ సకాలంలో వర్షం కురవలేదు. పూత, పిందె సమయంలో కూడా పదును వర్షాలు కురవలేదు. దీంతో ఊడలు సరిగా దిగక చెట్టుకు మూడు లేదా నాలుగు కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవీ నాణ్యంగా లేవు. లొత్తగా మారాయి. నెల రోజుల


నుంచి పదును వర్షం లేక ప్రస్తుతం పంట ఎండిపోతోంది. విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి ఇప్పటి వరకూ ఎకరానికి రూ.20 వేలు ఖర్చు చేశారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పశుగ్రాసాన్ని సబ్సిడీతో ఇవ్వాలని కోరుతున్నారు.

మొత్తం ఎండిపోయింది..

ఏడు ఎకరాల్లో వేరుశనగ సాగుకు రూ.1.50 లక్షలు ఖర్చయింది. సకాలంలో వర్షం కురవకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. కాయలు ఏమాత్రం లేవు. పంట సాగుకు ఖర్చయిన మొత్తం కూడా రాదు. వేరుశనగ సాగు చేసి నష్టపోయాను.

- కొండప్ప, రాప్తాడు

రూ.లక్ష ఖర్చయింది..

జూనలో కురిసిన వర్షానికి ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. సేద్యం పనులు, వేరుశనగ విత్తనాలు, కూలీలు, ఎరువులు, మందు లు, ఇతరత్రా ఖర్చులు రూ.లక్ష అయింది. చెట్టుకు మూడు నాలుగు కాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ఔటన లేదు. - సాకే ముత్యాలన్న, రాప్తాడు

పశు గ్రాసం కూడా దొరకదు.

మూడున్నర ఎకరాల్లో వర్షాధారం కింద వేరుశనగ పంటను సాగు చేశాను. విత్తనం వేసినప్పటి నుంచి సకాలంలో వర్షం కురవలేదు. పంట ఎదుగుదల లేదు. కాయలు చాలా తక్కువగా ఉన్నాయి. పంట సాగుకు రూ.60 వేలు ఖర్చయింది. పెట్టుబడి కూడా దక్కదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

- శీల్ల మల్లికార్జున, రాప్తాడు

ఇనపుట్‌ సబ్సిడీ ఇవ్వాలి..

వేరుశనగ సాగుకు ఎకరానికి రూ.20 వేల ప్రకారం ఖర్చు చేశాము. వర్షాభావం కారణంగా పంట దిగుబడి ఏమాత్రం రాలేదు. పశుగ్రాసం కూడా దక్కే పరిస్థితి లేదు. ప్రభుత్వం రైతులకు ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకోవాలి

- శ్రీరాములు, రాప్తాడు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Sep 29 , 2024 | 12:27 AM