DASARA : దుర్గతులను పారదోలు దుర్గమ్మ
ABN, Publish Date - Oct 11 , 2024 | 12:14 AM
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఈనేపథ్యంలో స్థానిక కొత్తూరు( గుల్జార్‌పేట)లోని వాసవీ కన్యకాపరమేశ్వ రి ఆలయంలో మూలవిరాట్‌ను చిలుకలతో, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తులకు మధురవీరన, నాగదేవతల అలంకరణ చేశారు. పాతూరు కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను రంగుల బటన్లతో, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తిని మహిశాసుర మర్దినిగా అలంకరించారు.
అనంతపురం కల్చరల్, అక్టోబరు 10: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఈనేపథ్యంలో స్థానిక కొత్తూరు( గుల్జార్‌పేట)లోని వాసవీ కన్యకాపరమేశ్వ రి ఆలయంలో మూలవిరాట్‌ను చిలుకలతో, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తులకు మధురవీరన, నాగదేవతల అలంకరణ చేశారు. పాతూరు కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూలవిరాట్‌ను రంగుల బటన్లతో, ఆలయ ఆవరణలో ఉత్సవ మూర్తిని మహిశాసుర మర్దినిగా అలంకరించారు. శివ బాలయోగి ఆశ్రమంలో మహిషాసురమర్దినిగా, మొదటిరోడ్డులోని కాశీవిశ్వే శ్వర కోదండ రామాలయంలో శారదామాత ఉత్సవమూర్తిని దుర్గాదేవిగా అలంకరించారు.
ఆలయ ఆవరణలోని వేదికపై అర్ధనారీశ్వరి అలంకారం చేశారు. పాతూరులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కాళికామాతకు దుర్గాదేవి అలంకారం చేసి, దుర్గాహోమం నిర్వహించారు. లెనిననగర్‌లో పెద్దమ్మదేవతకు ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించడంతోపాటు రా త్రి అన్నదానం చేశారు. శారదానగర్‌లోని శివకోటి ఆలయంలో మహా లక్ష్మి అలంకారం, సాయినగర్‌లోని కనకదుర్గ భవాని దేవాలయం, రామచంద్ర నగర్‌లోని షిర్డీసాయి ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి బెజవాడ కనకదుర్గ అలంకారం చేశారు. హెచ్చెల్సీ కాలనీలోని నసనకోట ముత్యాల మ్మ, చెరువుకట్టపై వెలసిన నాగులపెద్దమ్మ తదితర ఆలయాల్లో అమ్మ వార్లను దుర్గామాతగా అలంకరించి పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
అనంతపురం క్లాక్‌టవర్ : స్థానిక అర్బనబ్యాంకులో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదో రోజు దుర్గాదేవి రూపంలో అమ్మవారు దర్శ న మిచ్చారు. అలాగే బ్యాంకు ఎదుటు బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన నవదుర్గల దర్శనం అందరినీ ఆకట్టుకుంది. టీడీపీ రాష్ట్ర కార్య దర్శి బుగ్గయ్యచౌదరి, అర్బన బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్‌లు అమ ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిన్నారుల సాంస్కృ తిక, నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 11 , 2024 | 12:14 AM