ROAD : దుమ్ము.. ధూళితో ప్రయాణం
ABN, Publish Date - Nov 22 , 2024 | 12:23 AM
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రోడ్లును ఏమాత్రం పట్టిం చుకోలేదు. కనీసం మరమ్మతులు చేయలేదు. తద్వారా ప్రధాన రహదారులు సైతం ఆధ్వానస్థితికి చేరి , ప్రజ లు అవస్థల నడుమ ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా నగర శివారులోని రుద్రం పే ట సమీపంలో కక్కలపల్లి క్రాస్ నుంచి టమోటా మా ర్కెట్ (మండీ) మీదుగా కక్కలపల్లి వరకు వెళ్లే రహ దారి(ఆర్‌అండ్‌బీ) పూర్తిగా దెబ్బతింది.
గుంతల్లో వాహనదారులకు నరకం
దారుణంగా కక్కలపల్లి రోడ్డు
ఏళ్ల తరబడి మరమ్మతు పనులు
చేపట్టని అధికారులు
అనంతపురం సిటి, నవంబరు 21, (ఆంధ్రజ్యోతి): వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రోడ్లును ఏమాత్రం పట్టిం చుకోలేదు. కనీసం మరమ్మతులు చేయలేదు. తద్వారా ప్రధాన రహదారులు సైతం ఆధ్వానస్థితికి చేరి , ప్రజ లు అవస్థల నడుమ ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా నగర శివారులోని రుద్రం పే ట సమీపంలో కక్కలపల్లి క్రాస్ నుంచి టమోటా మా ర్కెట్ (మండీ) మీదుగా కక్కలపల్లి వరకు వెళ్లే రహ దారి(ఆర్‌అండ్‌బీ) పూర్తిగా దెబ్బతింది. ఆ దారి గుండా ప్రయాణం చేయాలంటే నరకం కనిపి స్తోందని ప్రజలు వాపోతు న్నారు. టమోటా మండీ నుంచి ఆదాయం ఉన్నప్ప టికి ప్రభుత్వం ఈ రోడ్డుపై దృష్టి పెట్టక పోవడం పలు విమర్శలకు తా విస్తోంది.
మరమ్మతులతోనే సరి పెడతారా..?
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్డు మరమ్మతు లకు కేవలం రూ. 20లక్షలు మంజూరు చేసి మమ అని పించింది. ఆ నిధులు సరిపోకపోవడంతో ఆర్ అండ్‌బీ అధికారులు కొంతమేర సిమెంట్ రోడ్డు వేసి వదిలేశారు. నిత్యం టమోట్ మార్కెట్‌కు పెద్దఎత్తున వాహనాలు వస్తూ వెళ్తుండటంతో పాటు ఈ రోడ్డుపై ఇతర ప్రాంతాలకు చాలా వాహనాలు సంచరిస్తుంటా యి. దీంతో సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా ఆధ్వానంగా మారింది. కక్కలపల్లి క్రాస్ నుంచి టమోటా మండీ వరకు గుంతలమయమైన మట్టి రోడ్డులో వాహన చోదకుల అవస్థలు వర్ణనాతీతం.
అధిక వాహనాల సంచారం వల్ల రోడ్డుపై నిత్యం దు మ్మురేగుతూనే ఉంటుంది. అందులోనే పాదచారులు, ద్విచక్ర వాహన దారులతో పాటు మిగిలిన వాహన చోదకులు ముక్కుమూసుకుని ప్రయాణించాల్సి వస్తోం ది. వర్షం వస్తే అంతే సంగతులు అన్నట్టు పరిస్థితి తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రోడ్డు మరమ్మతులకు రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేసింది. కానీ 90శాతం దెబ్బతిన్న ఆ రోడ్డును పూర్తిగా బాగు చేసేందుకు ఆ నిధులు సరిపోవు. మరమ్మతు లకు కాకుండా శాశ్వతంగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే మంచి దనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఆ రోడ్డు పక్కన దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తున్న వారు, వినియోగ దారుల పరిస్థితి అగమ్యగోచరం.
మరమ్మతులకు టెండర్ పూర్తయింది- బాలకాటమయ్య, డీఈఈ, ఆర్‌అండ్‌బీ
. ఈ రోడ్డు ఎక్కువుగా దెబ్బతిన్న మాట వాస్తవమే. గత ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపాం. మరమ్మతులకు మాత్రమే నిధులు అప్పట్లో వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే.. స్పందించి మరమ్మ తులకు రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేసింది. శాశ్వత రోడ్డుకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపాం. భవిష్యతలో నిధులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అతి త్వ రలోనే మరమ్మతుల పనులు చేయనున్నాం. టెండర్ పక్రియ కూడా పూర్తయింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 22 , 2024 | 12:23 AM