SINGANAMALA : నేతలు మారినా.... మారని స్థితి
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:03 AM
పేరుకే నియోజకవర్గం కేంద్రం. ఎంతమంది పాలకులు మా రినా శింగనమల అభివృద్ధి శూన్యం. గ్రా మాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా మని గతంలో పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ఇంతవరకు చొరవ చూకపోవడం కొస మెరపు. 1952లో పుట్లూరు నియోజకవ ర్గం నుంచి శింగనమల నియోజకవర్గం గా మారింది.
అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గ కేంద్రం
హామీలకే పరిమితమై చెరువు లోకలైజేషన
శింగనమల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పేరుకే నియోజకవర్గం కేంద్రం. ఎంతమంది పాలకులు మా రినా శింగనమల అభివృద్ధి శూన్యం. గ్రా మాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా మని గతంలో పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ఇంతవరకు చొరవ చూకపోవడం కొస మెరపు. 1952లో పుట్లూరు నియోజకవ ర్గం నుంచి శింగనమల నియోజకవర్గం గా మారింది. నియోజకవర్గ కేంద్రం శింగనమల. ఈ గ్రామానికి ప్రధానమై న శింగనమల చెరువు. గతంలో వర్షాలు బాగా కురవడంతో చెరువు నిండి, ఆయకట్టు కింద మూడు పంటలు సాగు చేసేవారు. అయితే కొన్నేళ్లుగా వర్షాలు సరిగా కురవక చెరువుకు నీరు అంతంత మాత్రంగానే చేరుతోంది. దీంతో చెరువును లోకలై జేషన చేయిస్తా మని దాదాపు నలభై ఏళ్ల కిందటి ఎమ్మెల్యే గురు మూర్తి నుంచి గత వైసీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వరకు చాలామంది హామీ ఇచ్చారు. కానీ జీఓ తీసుకురాలేకపోయారు. ఇదిలాఉంటే శింగనమ ల 1952లో నియోజకవర్గ కేంద్రంగా మారినా పరిస్థి తిలో ఏ మాత్రం మార్పు లేదు. గ్రామంలో డైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. రోడ్డు విస్తీర్ణం చేపట్టలేదు. ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా మారింది.
చెరువులో నీరుంటే గ్రామం సుభిక్షం
గతంలో బాగా వర్షాలు కురిసి చెరువులో నీరు పుష్కలంగా ఉండడంతో మూడు పంటలు పండి శింగనమల కళకళలాడేది. రాను రాను వర్షాలు రాకపో వడంతో చెరువులోనికి నీరు చేరలేదు. దీంతో ఆయక ట్టు భూములు బీళ్లుగా మారాయి. దీంతో వ్యవసాయ పనులు లేకపోవడంతో శింగనమల, గోవిందరా యుని పేటకు చెందిన వారు అనంతపురంలో హమాలీలుగా స్థిరపడ్డారు. మహిళలు, యవకులు అనంతపురంలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనోపాధి పొదుంతు న్నారు. ఒకప్పుడు మూడు పంటలతో కళకళలాడిన గ్రామం నేడు కరువుతో అల్లాడుతోంది. చెరువులో నీరు చేరాలంటే చెరువు లోకలైజేషన ఒక్కటే పరిష్కా రమని పాలకులు దానిపై దృష్టి సారించారు.
అర్థంతరంగా అండర్ డ్రైనేజ్
శింగనమల పరిశుభ్రంగా ఉండాలని మాజీ ఎమ్మె ల్యే జొన్నలగడ్డ పద్మావతి రూ. కోటితో అండర్ డ్రైనేజీ అని పనులు ప్రారంభించారు. 20 శాతం కూడా పూర్తి కాకుండానే మధ్యలోనే వదిలేశారు. దీంతో గ్రామంలో మురుగు నీరు ఎక్కడ పడేతే అక్కడ నిలిచిపోతోంది. దానితో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆస్పత్రి పాలవు తున్నారు. అలాగే శింగనమల చెరువు కట్ట నుంచి దర్గా వరకు రోడ్డు వెడల్పు పనుల కోసం మాజీ ఎమ్మెల్యే భర్త ఆలూరు సాంబశివారెడ్డి రూ. 1.20 కోట్లు నిధులు మంజారు చేయించారు. అయితే ఎక్క డా పనులు చేయలేదు 200 మీటర్ల సీసీ రోడ్డు వేసి మమ అనిపించారు. ప్రతిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన తరువాత శింగనమ లను దదత్త తీసుకుంటున్నామని చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు సాకే శైలజానాథ్ యామినీబాల, పద్మావతి అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
చెరువు లోకలైజేషన తప్పక చేయాలి- పూల గోవిందు, శింగనమల
గత 30 సంవత్సరాల నుంచి చెరువు కింద పంట సాగు సక్ర మంగా లేదు. మా చిన్నతనం లో ఇంటికి వచ్చిన వాళ్లకు క డుపు నిండా బువ్వ పెట్టే వా ళ్లం. ఇప్పుడు పంటలు లేక ఇంటి వద్దకు వచ్చిన వారిని మాట వరుసకైనా బువ్వ తినమ ని అడగలేక పోతున్నాం. చెరువులో నీరుంటే గ్రామా నికి పూర్వవైభం వస్తుది. చెరువుకు ప్రతి సంవత్సరం నీరు రావాలంటే లోకలైజేషన ఒక్కటే మార్గం.
ఉపాధి మార్గాలు చూపాలి- దఫేదార్ నారాయణ స్వామి, శింగనమల
మా ఉరిలో అందరికి వ్యవ సాయ పనులతోనే జీవనోపాధి. అయితే 30 ఏళ్ల నుంచి ఎక్కడా పం టల్లేవు. దీంతో చాలా మంది జీవనోపాధి కోసం అనం తపురం వెళ్లి హమాలీలుగా, దుకాణాల్లో వర్కర్లుగా జీవిస్తు న్నారు. వర్షాల ద్యారా చెరువు లోకి నీరు చేరుతుందనే నమ్మకం లేదు. ప్రభుత్వం స్థానికంగా చిన్న పరిశ్రమలు చేసి యవతకు ఉపాధి కల్పించాలి
ఇప్పటికైనా పాలకులు స్పందించాలి- శంకర్‌గౌడ్, శింగనమల
ఎన్నికల సమయంలో నాయ కులు చెరువు లోకలైజేషన మా టతో శింగనమలకు వస్తా రు. ఆ తరువాత ఐదేళ్ల కాలం గ డుపుతారు. గత ఆరుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాలోనే వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పద్మా వతి లోకలైజేషన చేశామని ప్రచా రం చేశారు. చెరువులో నీరు లేనప్పుడు చుక్క నీరు ఇవ్వలేదు. ఇప్పటికైనా పాలకులు చెరువు లోకలై జేషనపై దృష్టి పెట్టాలి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 01 , 2024 | 12:03 AM