Fengal : ఫెంగల్ జల్లులు
ABN, Publish Date - Dec 05 , 2024 | 01:00 AM
ఫెంగల్ ప్రభావంతో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఐదు మండలాలలో మంగళవారం చిరుజల్లులు పడ్డాయి. పుట్లూరు మండలంలో 6.4 మి.మీ., బ్రహ్మసముద్రం, యల్లనూరు మండలాలలో 3.2 మి.మీ., కళ్యాణదుర్గం 1.6, గుంతకల్లు 1.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఆకాశం మేఘావృతమై కనిపించింది. అనంతపురం, యాడికి, పుట్లూరు తదితర ప్రాంతాల్లో తుంపరలు, జల్లులు పడ్డాయి. గార్లదిన్నె, ..
తడిసిన వరి ధాన్యం
నేలకొరిగిన వరి పైరు
అనంతపురం అర్బన, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ ప్రభావంతో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఐదు మండలాలలో మంగళవారం చిరుజల్లులు పడ్డాయి. పుట్లూరు మండలంలో 6.4 మి.మీ., బ్రహ్మసముద్రం, యల్లనూరు మండలాలలో 3.2 మి.మీ., కళ్యాణదుర్గం 1.6, గుంతకల్లు 1.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఆకాశం మేఘావృతమై కనిపించింది. అనంతపురం, యాడికి, పుట్లూరు తదితర ప్రాంతాల్లో తుంపరలు, జల్లులు పడ్డాయి. గార్లదిన్నె,
అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి వద్ద కోత కోసి ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. బొమ్మనహాళ్ మండలంలోని పలు గ్రామాల్లో చిరుజల్లులు కురిశాయి. ఈదురుగాలులకు 200 ఎకరాల దాకా వరి పంట నేలకొరిగింది. దీంతో కోత సమయంలో ధాన్యం రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యంత్రంతో వరి పంట కోతకు ఎకరానికి గంట నుంచి గంటా 20 నిమిషాల సమయం పడుతుంది. నేలకొరిగితే మూడున్న గంటలకు పైగా సమయం పడుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరం వరి కోతకు రూ.3500 వసూలు చేస్తున్నారని, నేలకొరిగిన పంటకు మాత్రం ఎకరానికి రూ.10 వేల దాకా తీసుకుంటారని రైతులు అంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 05 , 2024 | 01:00 AM