FEST : ఆవిష్కరణల వేదికగా ఫెస్ట్ వేడుకలు
ABN, Publish Date - Dec 05 , 2024 | 12:22 AM
విద్యార్థులు వారి నైపుణ్యా లను ఆవిష్కరణల రూపంలో ప్రదర్శించడానికి ఫెస్ట్ వేడుకలు వేదికలా ఉపయోగపడుతాయని టెక్నికల్ ఎడ్యుకేషన ఆర్జేడీ నిర్మల్‌కుమార్ ప్రియ పేర్కొన్నా రు. అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వ హిస్తున్న పాలిటెక్నిక్ ఫెస్ట్-2024 వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి.
టెక్నికల్ ఎడ్యుకేషన
ఆర్జేడీ నిర్మల్‌కుమార్ ప్రియ
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు వారి నైపుణ్యా లను ఆవిష్కరణల రూపంలో ప్రదర్శించడానికి ఫెస్ట్ వేడుకలు వేదికలా ఉపయోగపడుతాయని టెక్నికల్ ఎడ్యుకేషన ఆర్జేడీ నిర్మల్‌కుమార్ ప్రియ పేర్కొన్నా రు. అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వ హిస్తున్న పాలిటెక్నిక్ ఫెస్ట్-2024 వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి సమన్వయకర్తగా ఏర్పాటుచేసిన టెక్‌ఫెస్ట్‌కు నిర్మల్‌కుమా ర్‌ప్రియ, డిప్యూటీ సెక్రెటరి వేణుమాధవ్, జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీప్యూటి సెక్రెటరీ వేణుమాదవ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల ఆలోచనలు ప్రదర్శించేలా రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్ టెక్‌ఫెస్ట్‌ను ఏర్పాటు చేయించారని తెలి పారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు తిలకించారు. కార్యక్రమంలో విభాగాధిపతు లు చ్రందశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ధీరేంద్రబాబు, శ్రీనివాసరావు, శేఖర్, అధ్యాపకులు వెంకటసుబ్బయ్య, సుంకన్న, రాంబాబు, ఓంకార్, రఘురామరెడ్డి, బాలచంద్రనాయక్, కరుణకుమార్, నరసింహులు, కిష్టప్ప తదిరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 05 , 2024 | 12:22 AM