ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPM : సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:08 AM

సాగు, తాగు నీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వాటి ఆధునీకరణ చేపట్టాలని సీపీఎం సీనియర్‌ నాయకులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ విమర్శిం చారు. తుంగభద్ర ప్రాజెక్టులో నీరు పొంగిపోర్లుతున్న సుబ్బరాయసాగర్‌ నింపలేని దౌర్భాగ్యస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం మండలపరిధిలోని నడిందొడ్డి, కేసేపల్లి మీదుగా మం డల కేంద్రమైన నార్పలకు చేరింది.

Senior CPM leader Obulu speaking at Narpalo

సీపీఎం నాయకులు ఓబులు, రాంభూపాల్‌ డిమాండ్‌

నార్పల, అక్టోబరు18 (ఆంధ్రజ్యోతి): సాగు, తాగు నీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వాటి ఆధునీకరణ చేపట్టాలని సీపీఎం సీనియర్‌ నాయకులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ విమర్శిం చారు. తుంగభద్ర ప్రాజెక్టులో నీరు పొంగిపోర్లుతున్న సుబ్బరాయసాగర్‌ నింపలేని దౌర్భాగ్యస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం మండలపరిధిలోని నడిందొడ్డి, కేసేపల్లి మీదుగా మం డల కేంద్రమైన నార్పలకు చేరింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించి మాట్లాడారు. రైతుల పక్షాన సీపీఎం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర ని ర్వహిస్తోందని, ఈనెల 21న కలెక్టరేట్‌ వద్ద మహాధర్నాకు రైతులు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జి ల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ నల్లప్ప, బాలరంగయ్య, జిల్లా కమిటీ సభ్యు లు చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, రైతు సంఘం రాజా, రామి రెడ్డి, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, పుల్లన్న, నాగరాజు, మండల నాయకులు ప్రభాకర్‌, రామాంజినేయులు, నాగన్న, దేవమ్మ పాల్గొన్నారు.


శింగనమల : సీపీఎం బస్సు యాత్ర శుక్రవారం నియోజకవర్గం కేంద్రమై శింగనమలలోనూ సాగింది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభ లో సీపీఎం సీనియర్‌ నాయకుడు ఓబుళు, జిల్లా కార్యదర్శి రాం భూపాల్‌ మాట్లాడుతూ తుంగభద్ర ప్రాజెక్టులో నీరు పొంగిపొర్లుతోందని, అయితే హెచఎల్‌సీ నీటితో నియోజకవర్గంలోని చెరువులను నింపలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భాస్కర్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

గార్లదిన్నె : సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రి గార్లదిన్నె చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్‌ మాట్లాడుతూ... శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలు నిండిన అనంత జిల్లాకు రాకపోవడం బాధాకరమన్నారు. నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, తరిమెల నాగరాజు, చెన్నారెడ్డి, నల్లప్ప, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం: సీపీఎం బస్సు యాత్ర శుక్రవారం మండల పరిఽ దిలోని బొమ్మలాటపల్లి, వెంకటాపురం, రేకలకుంట, రెడ్డిపల్లి, రోటరీపురం, కొర్రపాడు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్య దర్శి రాంభూపాల్‌, ీరాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా కమిటీ సభ్యులు ఓ నల్లప్ప హాజరై మాట్లాడారు. పీఎబీఆర్‌ కుడికాలువ, హెచ్చెల్సీ ద్వారా జిల్లా లోని చెరువులను నీటితో నింపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మం లో సీపీఏం మండల కార్యదర్శి కుళ్లాయప్ప, బాల రంగయ్య, చంద్రశేఖర్‌ రెడ్డి, కృష్ణమూర్తి, రాజా రామిరెడ్డి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2024 | 12:09 AM