ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ycp : నిధులు గుటుక్కు..!

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:38 AM

ఆ ఊళ్లో ఐదేళ్ల నుంచి తాగునీటి సమస్యలేదు. రక్షిత మంచినీటి పథకం నుంచి కావాల్సినంత నీరు అందుతోంది. 2019లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ట్యాంకర్లతో నీటిని అందించింది. ఆ తరువాత వాటర్‌ ట్యాంకర్ల అవసరమే పడలేదు. కానీ ట్యాంకర్లతో నీరు తెచ్చి గ్రామస్థుల దాహార్తిని తీర్చినట్లు నకిలీ రికార్డులను సృష్టించి సుమారు రూ.16 లక్షలు మింగేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఇదే ..

GLSR tank in use in the village

నీరున్న ఊరికి దాహం తీర్చారట.. నెలగొండలో వైసీపీ సర్పంచు మాయ

నకిలీ బిల్లులు.. ఫేక్‌ ఫొటోలతో బురిడీ

ఆర్థిక సంఘం నిధులు రూ.16 లక్షలు స్వాహా

ఆ ఊళ్లో ఐదేళ్ల నుంచి తాగునీటి సమస్యలేదు. రక్షిత మంచినీటి పథకం నుంచి కావాల్సినంత నీరు అందుతోంది. 2019లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ట్యాంకర్లతో నీటిని అందించింది. ఆ తరువాత వాటర్‌ ట్యాంకర్ల అవసరమే పడలేదు. కానీ ట్యాంకర్లతో నీరు తెచ్చి గ్రామస్థుల దాహార్తిని తీర్చినట్లు నకిలీ రికార్డులను సృష్టించి సుమారు రూ.16 లక్షలు మింగేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఇదే


అదనుగా నెలగొండలో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, పారిశుధ్య పరిరక్షణ, తాగునీటి పైపులైన్ల నిర్వహణ పేరిట బిల్లులు సృష్టించి ఎఫ్‌టీసీ నిధులను వైసీపీ సర్పంచు భాగ్యలక్ష్మి పక్కదారి పట్టించారు.

- గుంతకల్లు, ఆంధ్రజ్యోతి

పుష్కలంగా నీరు

నెలగొండలో రక్షిత మంచినీటి పథకానికి మూడు బోర్లు ఉన్నాయి. వాటిద్వారా గ్రామానికి పుష్కలంగా నీరు లభిస్తోంది. బస్టాపు వద్ద గ్రౌండ్‌ లెవెల్‌ స్టోరేజ్‌ (జీఎల్‌ఎ్‌సఆర్‌) ట్యాంకు ఉంది. దానికి చుట్టూ కొళాయిలను బిగించారు. గ్రామస్థులకు ఎప్పుడూ నీరు అందుబాటులో ఉంటుంది. జీఎల్‌ఎ్‌సఆర్‌ వద్ద నుంచి గ్రామస్థుల ఇళ్ల వద్దకు పైప్‌లైన ఉంది. దాని ద్వారా ఇళ్లకు నీటి కొళాయిలు ఉన్నాయి. మోటారు ఆన చేసిన సమయంలో అందరూ ఇళ్లవద్దే నీరు పట్టుకుంటారు. జీఎల్‌ఎ్‌సఆర్‌ వద్ద పాఠశాలకు ఆనుకుని నీటి శుద్ధి ప్లాంట్‌ కూడా ఉంది. గ్రామస్థులు బిందె రూ.2 ప్రకారం కొంటుంటారు. నాలుగేళ్లుగా గ్రామంలో ఇదే పరిస్థితి. 2019లో తాగునీటి ఎద్దడి ఏర్పడినప్పుడు ట్యాంకరుతో రోజుకు 11 ట్రిప్పుల నీరు సరఫరా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ట్యాంకర్ల అవసరం ఏర్పడలేదు. ఊరిలోకి ఒక్క నీటి ట్యాంకరు కూడా రాలేదు. కానీ నీటి సరఫరా, పైప్‌లైనల మరమ్మతు, పారిశుధ్యం పేరిట ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.15,92,448 డ్రా చేశారు. జనవరి 29వ తేదీ నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకూ 27 బిల్లులను సృష్టించి.. నిధులను డ్రా చేశారు. వాటర్‌ సప్లై, శానిటేషన కింద రూ.11.23 లక్షలు, పైప్డ్‌ వాటర్‌ సప్లై (పీడబ్లూఎస్‌) మెయుంటెనెన్స కింద రూ.4.69 లక్షల బిల్లులు తీసుకున్నారు.

జీపీఎస్‌ మాయాజాలం

చేసిన పనులను అప్పటికప్పుడు ప్రభుత్వ యాప్‌లో ఫొటో జియోగ్రాఫికల్‌ ట్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నకిలీ ఫొటోలు, తప్పుడు సమయాలను నమోదు చేశారు. ఒకే ఫొటోను పలు వర్కులకు వినియోగించారు. జియో ట్యాగ్‌ అయిన ఫొటోలలో కొన్ని ఏం ఫొటో తీశారో కూడా తెలియనంత అధ్వానంగా బ్లర్‌ ఇమేజ్‌లను అప్‌లోడ్‌ చేశారు. దీన్ని బట్టి అక్రమాలలో అధికారులు, సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ అక్రమాలపై కొందరు గ్రామస్థులు ఇటీవల కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.

నీటి సమస్యే లేదు..

పంచాయతీ ఎన్నికలు జరగిన తర్వాత మూడేళ్లుగా మా గ్రామంలో తాగునీటి సమస్యే ఏర్పడలేదు. వాటర్‌ ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయలేదు. ఒక్క ట్యాంకరు కూడా గ్రామంలోకి రాలేదు.

- రామదాసు, నెలగొండ

2019లో మాత్రమే..

మా ఊరిలో 2019 వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడింది. అప్పుడు గ్రామానికి ట్యాంకర్లతో స్పెషల్‌ ఆఫీసరు ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గ్రామంలో నీటి సమస్యే ఏర్పడలేదు.

-నారాయణ స్వామి, నెలగొండ

నకిలీ బిల్లులు పెట్టుకున్నారు..

గ్రామంలో పనులు చేయకుండానే పంచాయతీలో డబ్బులు డ్రా చేశారు. నకిలీ బిల్లులు, తప్పుడు జీపీఎస్‌ ఫొటోలతో సర్పంచు భాగ్యలక్ష్మి నిధులు కాజేశారు. అధికారులు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి.

- శ్రీనివాసులు, నెలగొండ

విచారిస్తాం..

నెలగొండలో జరిగిన అవినీతిపై సమాచారం లేదు. కలెక్టరుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఆదేశాలు వస్తే సత్వరమే విచారణ చేపడతాం. త్వరలో ఆ గ్రామానికి ఈఓఆర్డీని పంపి విచారణ జరిపిస్తాను. అక్రమాలు చోటుచేసుకుని ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

- శ్రీకాంత చౌదరి, గుంతకల్లు ఎంపీడీఓ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2024 | 12:38 AM