ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP : ఉద్యానమా.. ఊపిరి పీల్చుకో..!

ABN, Publish Date - Jun 09 , 2024 | 12:04 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఉద్యాన రైతులు కష్టాలను ఎదుర్కొన్నారు. హార్టికల్చర్‌ డీలా పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యాన రైతులకు జగన మొండి చేయి చూపారు. టీడీపీ హయాంలో ప్రతి ఏటా ఉద్యాన రైతులకు పలు రకాల రాయితీలను అందించి ఆదుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీలను తగ్గించింది. రైతుల్లో కొందరికే లబ్ధి చేకూరింది. ఎక్కువ శాతం రైతులకు అన్యాయం జరిగింది. టీడీపీ హయాంతో పోలిస్తే వైసీపీ పాలనలో 50 శాతానికిపైగా నిధులను తగ్గించారు. ఐదేళ్లుగా అరకొరగా విధించిన టార్గెట్లకూ నిధులు సకాలంలో విడుదల చేయలేదు. దీంతో రైతులకు సరైన సమాధానం ...

బాబు మళ్లీ వచ్చారు.. ఆదుకుంటారు

తోట పంటల రైతుల్లో ఎన్నెన్నో ఆశలు

వైసీపీ పాలనలో పథకాల ఎత్తివేత

సబ్సిడీ నిధుల నిలిపివేతతో

ఉద్యాన రైతులకు తీవ్ర ఇబ్బందులు

వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఉద్యాన రైతులు కష్టాలను ఎదుర్కొన్నారు. హార్టికల్చర్‌ డీలా పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యాన రైతులకు జగన మొండి చేయి చూపారు. టీడీపీ హయాంలో ప్రతి ఏటా ఉద్యాన రైతులకు పలు రకాల రాయితీలను అందించి ఆదుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీలను తగ్గించింది. రైతుల్లో కొందరికే లబ్ధి చేకూరింది. ఎక్కువ శాతం రైతులకు అన్యాయం జరిగింది. టీడీపీ హయాంతో పోలిస్తే వైసీపీ పాలనలో 50 శాతానికిపైగా నిధులను తగ్గించారు. ఐదేళ్లుగా అరకొరగా విధించిన టార్గెట్లకూ నిధులు సకాలంలో విడుదల చేయలేదు. దీంతో రైతులకు సరైన సమాధానం


చెప్పలేక ఉద్యాన శాఖ అధికారులు తలలు పట్టుకున్నారు. జగన అనాలోచిత నిర్ణయాలతో జిల్లాలో వేలాది మంది ఉద్యాన రైతులు సబ్సిడీ పథకాలకు దూరమయ్యారు. పంటలు సాగుచేయలేక నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా..? తమకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని నిరీక్షించారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో ఉద్యాన రైతులు ఇక తమ కష్టాలు తీరినట్టేనని ఊరిపి పీల్చుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ అనంతను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. గతంలో అందించిన సబ్సిడీలను పునరుద్ధరించి, హార్టికల్చర్‌కు పూర్వవైభవం తెస్తానని భరోసా ఇచ్చారు. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

- అనంతపురం అర్బన/పుట్లూరు

స్టేట్‌ ప్లాన పథకాలు ఎత్తివేత

ఉద్యాన శాఖలో ఎక్కువ శాతం పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టేట్‌ ప్లాన విడుదల చేసింది. పలు రకాల పథకాలను అమలు చేసింది. ఉమ్మడి జిల్లాకు స్టేట్‌ ప్లాన పథకాల కింద ఏడాదికి రూ.10 కోట్లకుపైగా నిధులు కేటాయించారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం రాయితీ వర్తింపజేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే స్టేట్‌ ప్లాన పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్టేట్‌ ప్లాన పథకం కింద పాలిహౌస్‌, ఫారం పాండ్స్‌, ప్యాక్‌ హౌస్‌, కూరగాయల పంటలకు పందిళ్లు ఏర్పాటు చేసుకునేందుకు యాభై శాతం సబ్సిడీ అందించే వారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం సబ్సిడీ అందించేవారు. ఇవి కొత్త తోటల విస్తరణకు, పాత తోటల పునరుద్ధరణకు ఉద్యాన రైతులకు ఎంతగానో తోడ్పడేవి. వైసీపీ ప్రభుత్వం వీటిని నిలిపేయడంతో రైతులు


నష్టపోయారు.

అరకొర పథకాలపైనా అశ్రద్ధ

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యాన రైతులకు అందిందే అరకొర పథకాలు. వాటి అమలులోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఆర్‌కేవీవై పథకం ద్వారా కలెక్షన సెంటర్లు, సోలార్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రతి ఏటా ఇచ్చిన అరకొరగా లక్ష్యాలను కూడా అధికారులు పూర్తి చేయలేకపోయారు. ఆర్‌కేవీవై (రాషీ్ట్రయ కృషి విజ్ఞాన యోజన) పథకంలో కొత్త పంటల విస్తీర్ణం పెంచాలి. రెండో సంవత్సరం నిర్వహణకు లక్ష్యం మేరకు నిధులు విడుదల చేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంఐడీహెచ (మిషన ఫర్‌ ఇంటెగ్రేటెడ్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌) పథకం ద్వారా మామిడి, జామ, చీనీ, దానిమ్మ, అరటి, బొప్పాయి తదితర పంటల విస్తీర్ణం పెంచాలి. కానీ పట్టించుకోలేదు. ప్లాస్టిక్‌ మల్చింగ్‌, ఫారం పాండ్స్‌, ప్యాక్‌ హౌస్‌, ఉద్యాన యాంత్రీకరణ తదితర పథకాలకు నిధులు మంజూరు చేయలేదు. ఎంపిక చేసిన రైతులు తమ వాటా డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైనా.. ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము విడుదలలో జాప్యం చేశారు. దీంతో పథకాలు అమలుకు నోచుకోలేదు. టీడీపీ హయాంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి, వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రైతు సంఘాల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, ఇతర సదుపాయాలు కల్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఉత్పత్తి సంఘాలను గాలికి వదిలేసింది.

సబ్సిడీలు రాలేదు..

ఐదు ఎకరాల్లో చీనీ పంట సాగు చేస్తున్నాను. వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ డబ్బులు రాలేదు. టీడీపీ హయాంలో కొత్త తోటల పథకం, పాత తోటల పునరుద్ధరణ, ఇతర రకాల పథకాలు అమలు చేశారు. ఉద్యాన రైతులకు సబ్సిడీలు వర్తింపజేసి ఆదుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్నింటినీ ఆపేశారు. సొంత డబ్బులతోనే తోటలో అన్ని రకాల పనులు చేసుకున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.


- రవికుమార్‌రెడ్డి, గోపరాజుపల్లి, పుట్లూరు మండలం

నిధులు మంజూరు చేయాలి..

వైసీపీ హయాంలో ఉద్యాన రైతులకు చేసిందేమీ లేదు. నాలుగు ఎకరాల్లో అరటి పంట సాగు చేశాను. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధీ చేకూరలేదు. టీడీపీ హయాంలో పలు రకాల పథకాల ద్వారా సబ్సిడీలు వర్తింపజేసి చేయూతనిచ్చారు. చంద్రబాబు అధికారం చేపట్టాక ఉద్యాన పథకాలను తిరిగి అమలు చేయాలి. విరివిగా నిధులు మంజూరు చేసి ఆదుకోవాలి.

- రవీంద్ర చౌదరి, చెర్లోపల్లి, పుట్లూరు మండలం

తోటలకు ఊపిరిపోయాలి...

వైసీపీ పాలనలో హార్టికల్చర్‌ను పూర్తిగా విస్మరించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అనంతను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్ది, తోట పంటలకు మళ్లీ ఊపిరిపోయాలి. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ పాలనలో ఉద్యాన రైతులకు భారీగా సబ్సిడీలు తగ్గించారు. టీడీపీ ప్రభుత్వంలో చిన్న, సన్నకారు ఉద్యాన రైతులకు ఆశించిన స్థాయిలో సబ్సిడీలు వర్తింపజేసి ఆదుకున్నారు. వైసీపీ పాలనలో ఉద్యాన రైతులకు మొండి చేయి చూపారు. పలు రకాల ఉద్యాన సబ్సిడీలు రద్దు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పాత పథకాలను టీడీపీ కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలి. ఉద్యాన రైతులను మరింతగా ప్రోత్సహించాలి.


- శివారెడ్డి, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి

రైతులకు అన్యాయం..

వైౖసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యాన రైతులకు తీరని అన్యాయం చేశారు. టీడీపీ హయాంలో అందించిన పథకాలను రద్దు చేశారు. అరకొరగా అందించే సబ్సిడీలు కూడా ఆలస్యం చేశారు. ఉద్యాన శాఖకు బడ్జెట్‌ను పెంచి, కరువు జిల్లా రైతులకు చేయూతనివ్వాల్సిందిపోయి.. మొండిచేయి చూపారు. వైసీపీ పాలనపై ఉద్యాన రైతులు తీవ్ర అసంతృప్తిలో ఉండటంతోనే ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనంతను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేందుకు ప్రత్యేక చొరవ చూపాలి. ఉద్యాన రైతులను ఆయన ఆదుకుంటారన్న నమ్మకం ఉంది.

- త్రిలోక్‌నాథ్‌నాయుడు, పండ్లతోటల రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Read more!

Updated Date - Jun 09 , 2024 | 12:05 AM

Advertising
Advertising