DEVOTIONAL : వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం
ABN, Publish Date - Dec 08 , 2024 | 01:11 AM
మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సుబ్ర హ్మణ్య షష్ఠి సందర్భంగా శనివారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామి వా రికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటంక గ్రామానికి చెందిన ఆవు ల నాగలక్ష్మి, ఆవుల కంచెప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సన్ని కన్నుల పండువగా జరిపిం చారు.
గార్లదిన్నె, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసిన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సుబ్ర హ్మణ్య షష్ఠి సందర్భంగా శనివారం వేకువజామున ఆలయ ప్రధాన ఆర్చకుడు రామాచార్యులు స్వామి వా రికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటంక గ్రామానికి చెందిన ఆవు ల నాగలక్ష్మి, ఆవుల కంచెప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సన్ని కన్నుల పండువగా జరిపిం చారు. అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. ఆలయం భక్తులతో కిటకిట లాడింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణో త్సవం తిలకించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బండారు ఈరమ్మ, సర్పంచు మేడాపురం లక్ష్మి, సుబ్బు, ఎర్రిస్వామి, చల్లానాగరాజు, రమణ, చౌదరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 08 , 2024 | 01:11 AM