ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SUNITHA: ప్రత్యామ్నాయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:58 PM

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో విత్తనాన్ని అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు.

MLA Paritala Sunitha distributing alternative seeds

చెన్నేకొత్తపల్లి, సెప్టెంబరు 6: ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో విత్తనాన్ని అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం రైతులకు సబ్సిడీ విత్తనాన్ని ఎమ్మెల్యే పంపిణీచేశారు. ఆమె మాట్లాడుతూ వర్షాభావంతోవేఏరుశనగ పంట సాగుచేసుకోని రైతులంతా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకోవాలన్నారు. మండలంలో 42వేల ఎకరాలకు గాను కేవలం 16వేల ఎకరాలలో మాత్రమే పంటను సాగుచేశారన్నారు. మిగిలిన రైతులు కూడా పంటలను సాగుచేసేందుకు సబ్సిడీతో విత్తనాలను అందిస్తున్నామన్నారు. సత్యసాయిజిల్లాలో 720 క్వింటాళ్ల అలసంద, 2099 క్వింటాళ్ల పెసులు, 15,220 క్వింటాళ్ల ఉలవలు మొత్తం 18,265 క్వింటాళ్ల విత్తనాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందన్నారు. రైతుకు ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఏఓ ఉదయ్‌కుమార్‌, ఏపీసీడ్స్‌ జిల్లా మేనేజర్‌ సిద్దయ్య, టీడీపీ కన్వీనర్‌ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, అంకే అమరేంద్ర, జనసేన కన్వీనర్‌ క్రాంతికుమార్‌, ఈడిగ చెన్నకేశవగౌడ్‌, మాడెం సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, హరినాథరెడ్డి, ముత్యాలప్ప, అమరేంద్రరెడ్డి, ఆంజనేయులు, కోళ్ల సూరి పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 11:58 PM

Advertising
Advertising