ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gravel case : గ్రావెల్‌ దందా నిజమే..!

ABN, Publish Date - Dec 11 , 2024 | 12:45 AM

వైసీపీ నాయకుడి గ్రావెల్‌ దందా వాస్తవమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు నివేదికను పంపారు. వైసీపీ నాయకుడు బొంబాయి రమే్‌షనాయుడు ప్రభుత్వ, మాన్యం భూముల్లో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుకున్నారని టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, లక్ష్మీనారాయణ, ఆదినారాయణ నవంబరు 11న కలెక్టరేట్‌ గ్రీవెన్సలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నివేదిక ...

Officials investigating Gravel case (File)

కలెక్టర్‌కు అధికారుల నివేదిక

యాడికి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడి గ్రావెల్‌ దందా వాస్తవమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు నివేదికను పంపారు. వైసీపీ నాయకుడు బొంబాయి రమే్‌షనాయుడు ప్రభుత్వ, మాన్యం భూముల్లో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుకున్నారని టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, లక్ష్మీనారాయణ, ఆదినారాయణ నవంబరు 11న కలెక్టరేట్‌ గ్రీవెన్సలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నివేదిక


ఇవ్వాలని యాడికి తహసీల్దార్‌ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయి. నవంబరు 27, 28, 29 తేదీల్లో రెవెన్యూ, మైన్స అండ్‌ జియాలజీ, విజిలెన్స, ట్రాన్సకో, గ్రామ పంచాయతీ, ఎండోమెంట్‌ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారించారు. తహసీల్దారు ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో నివేదికను తయారుచేసి కలెక్టర్‌కు పంపారు.

ఇదీ.. నివేదిక సారాంశం

కలెక్టర్‌ సర్‌..

వైసీపీ నాయకుడు, ఆయన బావమరిది ఆధ్వర్యంలో సర్వే నంబరు 753-1, చిన్నపేట ఆంజనేయస్వామిమాన్యం, సర్వే నంబరు 546 భైరవగుట్ట, సర్వే నంబరు 343 బూడిదతిప్ప, సర్వే నంబరు 1448, 1515 తిరునాంపల్లి వంక ప్రాంతాల నుంచి అనుమతి లేకుండా గ్రావెల్‌ను తరలించారు. యాడికి చుట్టుపక్కల వేసిన అనుమతి లేని లే అవుట్లకు తరలించారు. అక్కడి అంతర్గత రోడ్లకు గ్రావెల్‌ను వినియోగించారు. గుత్తి నుంచి తాడిపత్రి వెళ్లే 220 కేవీ విద్యుత టవర్‌ బేస్‌మెంట్‌ లెవల్‌ నుంచి 14 అడుగుల లోతు వరకు తవ్వి గ్రావెల్‌ను తరలించారు. దీనివల్ల విద్యుత టవర్‌ కూలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే మరో మూడు నాలుగు విద్యుత టవర్లు కూలిపోయే ప్రమాదం ఉంది. పర్యవసానంగా యాడికి, పెద్దపప్పూరు, తాడిపత్రి, యల్లనూరు, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీకి విద్యుత సరఫరా నిలిచిపోతుంది. ఒక్కొక్క విద్యుత టవర్‌ ఏర్పాటుకు రూ.2కోట్ల మేర ఖర్చు అవుతుంది. మరమ్మతులకు 15 నుంచి 20రోజుల సమయం పడుతుంది. కాబట్టి అక్రమాలకు పాల్పడినవారిపై నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకునేందుకు ఆదేశాల నిమిత్తం నివేదికను పంపుతున్నాము.

-ప్రతాపరెడ్డి, తహసీల్దారు, యాడికి

చర్యలపై ఉత్కంఠ

గ్రావెల్‌ దందా చేసిన వైసీపీ నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని యాడికి మండలంలో ఉత్కంఠ నెలకొంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అనుమతిలేని లే అవుట్‌లు వేసినవారిలో ఆందోళన మొదలైంది. అనుమతిలేని లే అవుట్లు, గ్రావెల్‌ దందాపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని ఆరా తీస్తున్నారు. యాడికి చుట్టుపక్కల అనుమతి లేని లే అవుట్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక్క లే అవుట్‌కు మాత్రమే అనుమతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లేఅవుట్లకు అనుమతి లేకపోవడం ఒక ఎత్తైతే.. వాటికి గ్రావెల్‌ను అక్రమంగా తరలించడం మరో ఎత్తు. పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 11 , 2024 | 12:45 AM