GANDI : ఘనంగా మహాత్ముడి జయంతి
ABN, Publish Date - Oct 03 , 2024 | 12:28 AM
సత్యం, అహింసే ఆయుధంగా ఆంగ్లేయులతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మగాంధీ 155వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళి అర్పించారు. నగరంలోని గాంధీ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్ వర్క్)
సత్యం, అహింసే ఆయుధంగా ఆంగ్లేయులతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మగాంధీ 155వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళి అర్పించారు. నగరంలోని గాంధీ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో గాంధీజీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నగరంలోని స్థానిక క్లాక్ టవర్ సమీపంలోని గాంధీ విగ్రహానికి టీడీపీ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, జిల్లా ప్రధాన కార్య దర్శి శ్రీధర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ అర్బన కార్యా లయంలో టీడీపీజిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తదితరులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి క్యాంప్ కార్యా లయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి తదితరులు గాంధీ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జేఎనటీయూ, ఎస్కేయూ, ఆర్ట్స్‌కళాశాల గ్రంథాలయంలో, ఎల్‌ఐసీ బ్రాంచలో-2లో ఏజెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకుతోట జగదీష్ అధ్యర్యంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు..
అదేవిధం గా క్టాక్‌టవర్ సమీపంలోఉన్న గాంధీ విగ్రహానికి ఎనఎస్‌యూఐ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్థానిక వైద్యకళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యాలరావు, పాతవూరులోని పవర్ ఆఫీస్ ఆవర ణంలో విద్యుత శాఖ ఎస్‌ఈ సంపతకుమార్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని జరుపుకున్నారు. నగరంలోని డీఈఓ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి డీఈఓ వరలక్ష్మి, ఇతర అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాపరిషత కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన గిజమ్మ పూల మాల వేసి నివాళులర్పించారు. జడ్పీ సీఈఓ ఓబుళమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏపీటీఎఫ్ నాయకులు సైతం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసిన నివాళులర్పించారు. యూటీఎఫ్ నాయకులు క్లాక్ టవర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశా రు. నగరపాలిక కార్యాలయంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, నగర మేయర్ మహమ్మద్ వసీం, కమిషనర్ నాగరాజులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నిర్వహించారు.అలాగే వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ, శాసి్త్రకి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌బాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అద్యక్షుడు కెప్టెన షేకన్న ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. అలాగే గార్లదిన్నె, చెన్నేకొత్తపల్లి , రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు. రాప్తాడు, నార్పల, శింగనమల మండలా ల్లో గాంధీ జయంతిని నిర్వహించారు. రాప్తాడులోని టీడీపీ కార్యాలయంలో, రాప్తాడు మండలంలోని ఎస్వీఐటీ కళాశాలలో గాంధీజీకి నివాళులర్పించారు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 03 , 2024 | 12:28 AM