Collector : గురువే గైడ్.. ఫిలాసఫర్
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:08 AM
గురువే ప్రతి ఒక్కరికీ గైడ్, ఫిలాసఫర్ అని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్‌లో గురువారం గురుపూజోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాణాలు కాపాడే డాక్టర్‌ను వైద్యో నారాయణో హరి అంటారని, అయితే గురువును సాక్షాత్తు..
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం విద్య, సెప్టెంబరు 5: గురువే ప్రతి ఒక్కరికీ గైడ్, ఫిలాసఫర్ అని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్‌లో గురువారం గురుపూజోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాణాలు కాపాడే డాక్టర్‌ను వైద్యో నారాయణో హరి అంటారని, అయితే గురువును సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా శాసా్త్రలు పేర్కొన్నాయని అన్నారు. గురువు లేకపోతే ప్రపంచమేలేదని అన్నారు. తాను నాలుగు ఎన్నికలు చూశారని, ఎన్నికల్లో ఉపాధ్యాయులు చేసే కృషి ప్రశంసనీయమని అన్నారు. సమాజంలో
ఉపాధ్యాయులకు ప్రత్యేకస్థానం ఉందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. విద్యార్థులను ఉన్నతస్థితికి తీసుకెళ్లే ఉపాధ్యాయులు ఉత్తమ సేవలందించాలని, వారిని సన్మానించడం సంతోషదాయకమని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయుల పట్ల చూపుతున్న గౌరవం, ఆదరణ ఆదర్శప్రాయమని అర్బన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయులు లేనిదే ఈ సమాజం లేదని అన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని గురువులను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు ఉత్తమ బోధన అందించాలని జడ్పీ చైర్‌పర్సన గిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ సూచించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ విజయభాస్కర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఈఓ వరలక్ష్మి, డీవీఈఓ వెంకటరమణనాయక్, ఏపీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 06 , 2024 | 12:09 AM