DEVOTIONAL : ఘనంగా కనకదాస జయంతి
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:28 AM
భక్త కనకదాస జయంతిని కురుబ కులస్థులు సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం నగరంతో పాటు రూరల్ మండలం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు.
భక్త కనకదాస జయంతిని కురుబ కులస్థులు సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం నగరంతో పాటు రూరల్ మండలం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు. చెన్నేకొత్తపల్లిలోని టీడీపీ కార్యాల యంలో కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామ గిరి మండలంలోని శేషంపల్లిలో మహిళలు జ్యోతులు, బోనాలను మోసుకెళ్లి కనకదాసకు సమర్పించారు.
- ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్
కనకదాస జీవితం ఆదర్శనీయం : జేఎనటీయూ వీసీ
అనంతపురం సెంట్రల్, నవంబరు18 (ఆంధ్రజ్యోతి) : భక్త కనకదాస జీవిత చరిత్ర విద్యార్థులకు ఆదర్శనీయమని జేఎనటీయూ ఇనచార్జ్ వీసీ ప్రొ ఫెసర్ సుదర్శనరావు పేర్కొన్నారు. సోమవారం జేఎనటీయూలో కనకదాస జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఇనచార్జ్ వీసీ సుదర్శనరావు, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ క్రిష్ణయ్య, ఓస్‌డీటూ వీసీ ప్రొఫెసర్ దేవన్న కనకదాస చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కనకదాస జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినందకు సీఎం చంద్రబాబు, మంత్రి సవితకు ఆర్‌ఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ నాగ భూషణం కృతజ్ఞతలు తెలిపారు. భక్త కనకదాస బహుజన ఆరాధ్య దైవమని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి కొనియాడారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 19 , 2024 | 12:28 AM