TDP : సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో హిందూపురం
ABN, Publish Date - Dec 04 , 2024 | 11:56 PM
టీడీపీ సభ్యత్వ నమోదులో హిందూపురం పార్లమెంట్ నియో జకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మె ల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. వెంకటాపు రంలో బుఽఽధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసు కున్నారు. జోన-5 పరిధిలో 3. 80 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేయించి రికార్డు సృష్టించారన్నారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
వెంకటాపురంలో సంబరాలు
రామగిరి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదులో హిందూపురం పార్లమెంట్ నియో జకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మె ల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. వెంకటాపు రంలో బుఽఽధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసు కున్నారు. జోన-5 పరిధిలో 3. 80 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు చేయించి రికార్డు సృష్టించారన్నారు. కేక్‌నుకట్ చేసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్పకు తినిపించి, సన్మా నించారు. ఈ సందర్భంగా అంజినప్ప మాట్లాడుతూ... హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిఽఽధిలో మొట్టమొదటి సారిగా పరిటాల సునీత వద్ద నుంచే సభ్యత్వ నమోదును ప్రారంభిం చామన్నారు.దీంతో సంబరాలు కూడా రాప్తాడు నియో జకవర్గంలోనే చేశామ న్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ... సభ్య త్వ నమోదులో రాప్తాడు నియోజకర్గం రాష్ట్రంలో 14వ స్థానం, పార్లమెంట్ పరిధిలో మూడో స్థానంలో ఉం దన్నారు. త్వరలోనే అగ్రస్థానం చేరుకుంటామన్నారు. రెండు మండలాల్లో సభ్యత్వనమోదు తక్కువగా ఉందని వారు ప్రతిష్టాత్మ కంగా తీసుకోవాలన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడు తూ...ధర్మవరం నియోజక వర్గం కూడా రాష్ట్రంలో 14వ స్థానం, పార్లమెంట్‌లో మూడో స్థానంలో ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్య కర్తలు కృషివల్లే సాఽఽధ్యమైం దన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, నాయ కులు రామ్మూర్తి నాయుడు, కమతం కాటమయ్య, చింతలపల్లి మహేశ, పరిశే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 04 , 2024 | 11:56 PM