SCHOOL GAMES : హోరాహోరీగా స్కూల్ గేమ్స్
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:30 AM
స్థానిక ఉన్నతపాఠశాలలో శుక్రవారం స్కూల్ గేమ్స్ పోటీలు హెచఎం ఓబుళమ్మ ఆధ్వర్యంలో హోరాహోరీగా జరి గాయి. మొదటి రోజు అండర్-14,17 క్యాటగరీలలో బాలికలకు పోటీలు నిర్వి హంచారు. మొత్తం 150 మంది బాలికలు పాల్గొన్నారు. క్రీడలు, అథ్లెటిక్స్ పోటీలలో పలు పాఠశాలల బాలికలు ప్రతిభను కనబరిచినట్లు పీడీ నల్లప్ప తెలిపారు.
చెన్నేకొత్తపల్లి, సెప్టెంబరు 20: స్థానిక ఉన్నతపాఠశాలలో శుక్రవారం స్కూల్ గేమ్స్ పోటీలు హెచఎం ఓబుళమ్మ ఆధ్వర్యంలో హోరాహోరీగా జరి గాయి. మొదటి రోజు అండర్-14,17 క్యాటగరీలలో బాలికలకు పోటీలు నిర్వి హంచారు. మొత్తం 150 మంది బాలికలు పాల్గొన్నారు. క్రీడలు, అథ్లెటిక్స్ పోటీలలో పలు పాఠశాలల బాలికలు ప్రతిభను కనబరిచినట్లు పీడీ నల్లప్ప తెలిపారు. .ఈ పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు విజయనిర్మల, అంజన్న, కుమార్, సుధాకర్, మహేశ్వరి, కొండమ్మ పాల్గొన్నారు.
రాప్తాడు: మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మండలంలోని వివిద పాఠశాలల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో నిర్వహించారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులను నియో జకవర్గస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశామన్నారు. హెచఎం సాంబ శివ, స్కూల్ గేమ్స్ మం డల కన్వీనర్ కేశవమూర్తి, రాజ శేఖర్, రాప్తాడు సర్పంచ సాకే తిరుపాలు, టీడీపీ మండల కన్వీనర్ కొండప్ప తదితరులు పాల్గొన్నారు.
శింగనమల: మండలకేంద్రం లోని జిల్లా పరిషత పాఠశాలలో పోటీలను ఎంఈఓ-2 శివప్రసాద్ ప్రారంభించారు. మండలంలోని అన్ని జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 21 , 2024 | 12:30 AM