ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPI : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:43 AM

రూరల్‌మండలంలోని ఉప్పరపల్లి పొలంలో పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక పేదలతో కలిసి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ...రూరల్‌లోని ఉప్పరపల్లి పొలం సర్వే నెంబర్‌ 194-8లో సుమారు 250 మంది వరకూ కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు.

CPI leaders protesting

సీపీఐ నాయకుల డిమాండ్‌

అనంతపురం విద్య, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రూరల్‌మండలంలోని ఉప్పరపల్లి పొలంలో పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక పేదలతో కలిసి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ...రూరల్‌లోని ఉప్పరపల్లి పొలం సర్వే నెంబర్‌ 194-8లో సుమారు 250 మంది వరకూ కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు. ఇది వంక పోరంబోకు కాదని గ్రామకంఠం భూమి అన్నారు. ఈ సర్వేనెంబర్‌లోని పేదలకు ఇళ్లపట్టా లు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆర్డీఓ కేశవనాయుడికి వినతిపత్రం అందించారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి రమణ, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి సంతోష్‌కుమార్‌, నగర సహాయ కార్యదర్శి అల్లిపీరా, ఇతర నాయకులు ఖాజా హుస్సేన, జయలక్ష్మి, వరలక్ష్మి, కృష్ణుడు, రాజు, సుందర్‌రాజు, జిలాన,భాష, మునాఫ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 03 , 2024 | 12:44 AM