ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP WARNING : ఎంత ధైర్యంరా నీకు?

ABN, Publish Date - May 03 , 2024 | 01:13 AM

టీడీపీ కండువా వేసుకుని మాకే ఎదురుగా వస్తావా? ఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, అతడి అనుచరులు టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని గువ్వలగొందంపల్లిలో గురువారం జరిగింది. బాధితుడు టీడీపీ కార్యకర్త బెల్లం వేణుగోపాల్‌ తెలిపిన మేరకు.. తమ బంధువు చనిపోవడంతో కుటుంబసభ్యులతో కలిసి పరామర్శించి తిరిగి కారులో స్వగ్రామమైన గువ్వలగొందంపల్లికి బయల్దేరారు. న్యామద్దల గ్రామ శివారులోకి రాగానే ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సోదరుడు...

A broken car mirror

మా ఎదురుగానే పార్టీ కండువా వేసుకుని తిరుగుతావా..?

టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి దాడి

చెన్నేకొత్తపల్లి, మే 2: టీడీపీ కండువా వేసుకుని మాకే ఎదురుగా వస్తావా? ఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, అతడి అనుచరులు టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని గువ్వలగొందంపల్లిలో గురువారం జరిగింది. బాధితుడు టీడీపీ కార్యకర్త బెల్లం వేణుగోపాల్‌ తెలిపిన మేరకు.. తమ బంధువు చనిపోవడంతో కుటుంబసభ్యులతో కలిసి పరామర్శించి తిరిగి కారులో స్వగ్రామమైన గువ్వలగొందంపల్లికి బయల్దేరారు. న్యామద్దల గ్రామ శివారులోకి రాగానే ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సోదరుడు, అనుచరులు టీడీపీ కార్యకర్త కారులో ఉన్న టీడీపీ కండువాను చూసి దాడికి


తెగబడ్డారు. కారులో ఉన్న బెల్లం వేణుగోపాల్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులను నానా దుర్భాషలాడుతూ భయబ్రాంతులకు గురి చేశారు. అంతటితో ఆగకుండా కారు ముందు అద్దాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. కనీసం పార్టీ కండువాలు వేసుకుని తిరిగే స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఎమ్మెల్యే సోదరుడి దౌర్జన్యంతో తన భార్య, పిల్లలు భయపడుతు న్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్‌రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందని వేణుగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. జరిగిన సంఘటనపై పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ ఘటనను టీడీపీ మండల నాయకులు తీవ్రంగా ఖండించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 03 , 2024 | 01:13 AM

Advertising
Advertising