HOSPITAL : జ్వరమని వస్తే సిబ్బంది ఎవరూ లేరు..!
ABN, Publish Date - Sep 12 , 2024 | 12:36 AM
జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఎవరూ లేరని రోగులు వాపోయారు. ఇలా అయితే పేదలకు వైద్యం అందేది ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడికి ప్రభుత్వ వైద్యశాలకు బుధవారం సాయం త్రం 4గంటల సమయంలో పలువురు రోగులు వచ్చారు. హాస్పిటల్‌లోని డాక్టర్లు ఉండేగది, ఇంజక్షన్లు వేసే గది తదితర గదులన్నీ మూసి వేసి సిబ్బంది ఎక్కడికో వెళ్లిపోయారు.
యాడికి ఆసుపత్రి తీరుపై రోగుల ఆవేదన
యాడికి, సెప్టెంబరు11: జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది ఎవరూ లేరని రోగులు వాపోయారు. ఇలా అయితే పేదలకు వైద్యం అందేది ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడికి ప్రభుత్వ వైద్యశాలకు బుధవారం సాయం త్రం 4గంటల సమయంలో పలువురు రోగులు వచ్చారు. హాస్పిటల్‌లోని డాక్టర్లు ఉండేగది, ఇంజక్షన్లు వేసే గది తదితర గదులన్నీ మూసి వేసి సిబ్బంది ఎక్కడికో వెళ్లిపోయారు. హాస్పిటల్‌లో సిబ్బంది ఎవరూ లేరు. చికిత్స కోసం వస్తే ఇంత పెద్ద హాస్పిటల్‌లో ఆరోగ్య సిబ్బంది ఒక్కరూ లే కుండా వెళ్లిపోవడం ఏంటని రోగులు ప్రశ్నిస్తున్నారు.
ఏదైనా అత్యవస రమని ఇక్కడకు వస్తే దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా వచ్చి ఆసుపత్రిలో వస్తువులు ఎత్తుకెళ్లినా దిక్కులేదంటున్నారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేయడానికి రోగులు ఫోన చేయగా స్పందన లేదు. ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టి ఆసుపత్రిలో సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
పిల్లాడికి జ్వరం వస్తే వచ్చా - మౌనిక, వెంగమనాయుడుకాలనీ, యాడికి
మా అబ్బాయి అఖిల్‌కు జ్వరం వస్తోంది. చూపించుకోవడానికి యాడికి ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఆరోగ్య సిబ్బంది ఒక్కరూ లేరు. దాదాపు గంటకు పైగా ఇక్కడే ఉన్నా. ఏం చేయాలో తెలియక వెనక్కి వెళ్లిపోతున్నాము. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాల్సిందే.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 12 , 2024 | 12:36 AM