ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VETARNARY : సరిగా అందని పశువైద్యం

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:47 AM

ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయంతో పాటు ఆ తరువాత అత్యంత ప్రాధాన్యం కల్గిన పశుపోషణ మండలంలో ని రైతులకు భారంగా మారింది. దీనికి తోడు పశువు లకు వ్యాధులు సోకినప్పుడు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి.

Regional Veterinary Hospital in Seekepally

ఆస్పత్రిలో అరకొరగానే మందులు

శిథిలావస్థలో ఆస్పత్రి భవనాలు

భారీగా నష్టపోతున్న పాడిరైతులు

చెన్నేకొత్తపల్లి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయంతో పాటు ఆ తరువాత అత్యంత ప్రాధాన్యం కల్గిన పశుపోషణ మండలంలో ని రైతులకు భారంగా మారింది. దీనికి తోడు పశువు లకు వ్యాధులు సోకినప్పుడు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులు భారీగా నష్టపోయి, కుటుంబపోషణ కష్టతరంగా మారుతోంది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం పాడిపరిశ్రమను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ మైనా పాడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.


మూడు మండలాల్లో పాడి ప్రధానం

కరువు మండలాలైన రామగిరి, కనగానపల్లి, చెన్నే కొత్తపల్లి మండలాల్లో గ్రామీణులకు చాలా వరకు పాడి ప్రధాన ఆధారంగా ఉంది. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది రైతులు ప్రత్యామ్నాయంగా పాడి రంగం వైపు మళ్లారు. దీంతో మూడు మండలాల్లో ల క్షల్లో ఆవులు, గేదెలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, కోళ్లు ఉన్నట్టు పశుగణాంకాలు చెబుతున్నాయి. అంతటి ప్రాధాన్యమున్న రంగంలో వైద్యసేవలు అరకొరగా ఉం డటంతో రైతులు తీవ్ర ఇబ్బ్దందులు పడుతున్నారు. సకాలంలో వైద్యసేవలు అందక పశువులు మృతిచెం దుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్నిచోట్ల పర్యవేక్షణ కొరవడి ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.


అరకొరగా మందులు - శిథిలావస్థలో భవనాలు

పశువుల ఆస్పత్రులలో చాలా వరకు మందుల కొరత ఉంది. సాధారణ మందులు కూడా ఉండటం లేదు. దీంతో పశువుల వైద్యులు బయట మెడికల్‌ షాపులకు మందులను రాసిస్తున్నారు. మూడునెలల కొకసారి సరఫరా చేయల్సిన మందులను ఐదారు నెలలకొకసారి చేస్తున్నట్లు సమాచారం. అలాగే గ్రా మీణ ప్రాంతాల్లో పలు వైద్యశాలలు శిథిలావస్థకు చేరాయి. అవి ఎప్పుడు కూలుతాయోనన్న భయంతో సిబ్బంది పనిచేస్తున్నారు. పైకప్పులు దెబ్బతిని వర్షాకా లంలో నీరు కారుతుండడంతో మందులు పాడైపోతు న్నాయి. చివరికి సీకేపల్లిలోని ప్రాంతీయ పశువైద్య శాల భవనం బాగా దెబ్బతింది. గ్రామీణ వైద్యశాల లైన ఎనఎస్‌ గేటు, మేడాపురం, న్యామద్దల, పేరూరు తదితర ఆస్పత్రి భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. కాగా రైతు సేవా కేంద్రాల్లో నిర్వహిస్తున్న 31 ఆస్పత్రు లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉం డగా పాడిపశువులు మరణిస్తే ప్రభుత్వం అందించే పశుబీమా పథకం అటకెక్కింది. గత వైసీపీ పాలనలో ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారని. గొర్రెలు, మేకల కు కూడా అందడంలేదని రైతులు అంటున్నారు.

మందుల కొరత వాస్తవమే - డాక్టర్‌ జ్యోతికుమారి, ఏడీఏ వెటర్నరీ, సీకేపల్లి

పశువుల ఆస్పత్రులలో కొంత మేర మందుల కొరత ఉన్నమాట వాస్తవమే. అన్ని రోగాలకు మందుల సరఫరా ఉండదు. దీంతో అప్పుడప్పుడు కొన్ని రోగాలకు బయటకు మందులు రాయాల్సి వస్తుంది. పలు ఆస్పత్రుల్లో పాతగదులు శిథిలావస్థలో ఉన్నాయి. సీకేపల్లి ఆస్పత్రి నూతన భవన నిర్మాణం కోసం రూ.30లక్షలతో ప్రతిపాదనలు పంపాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 10 , 2024 | 12:47 AM