RAIN : వాన కురిసింది.. కరెంటు పోయింది..!
ABN, Publish Date - May 25 , 2024 | 12:39 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం, బెళుగుప్ప, పుట్లూరు, కూడేరు, గుంతకల్లు, పామిడి, కుందుర్పి, రాప్తాడు, పెద్దవడుగూరు, విడపనకల్లు, ఉరవకొండ, గార్లదిన్నె తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. యాడికి, తాడిపత్రి, శింగనమల మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. వర్షం కారణంగా విద్యుత సరఫరాకు ...
అనంతపురం అర్బన/క్రైం, మే 24: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం, బెళుగుప్ప, పుట్లూరు, కూడేరు, గుంతకల్లు, పామిడి, కుందుర్పి, రాప్తాడు, పెద్దవడుగూరు, విడపనకల్లు, ఉరవకొండ, గార్లదిన్నె తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. యాడికి, తాడిపత్రి, శింగనమల మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. వర్షం కారణంగా విద్యుత సరఫరాకు గంటలతరబడి అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి..
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అనంతపురం నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నగరపాలిక కమిషనర్ మేఘస్వరూప్ శుక్రవారం సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. భారీ వృక్షాలు కింద ఉండరాదని సూచించారు. నగరవాసులు సహాయక చర్యల కోసం 08554-274765, 230234 హెల్ప్‌లైన నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 25 , 2024 | 12:39 AM