ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DASARA : అనంతరూపాల్లో జగన్మాత

ABN, Publish Date - Oct 08 , 2024 | 12:14 AM

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదోరోజు సోమవారం జిల్లా వ్యాప్తం గా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. జిల్లాకేంద్రంలో గుల్జార్‌ పేటలోని కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత మూలవిరాట్‌ను నవధాన్యాలతో, ఆల య ఆవరణలో ఉత్సవమూర్తులను శైలపుత్రిదేవి, గాయత్రిదేవి, సిద్ధిధాత్రి దేవిగా అలంకరించారు.

Children participating in pujas at Pathuru Renuka Yallamma temple

అనంతపురం కల్చరల్‌: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదోరోజు సోమవారం జిల్లా వ్యాప్తం గా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. జిల్లాకేంద్రంలో గుల్జార్‌ పేటలోని కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత మూలవిరాట్‌ను నవధాన్యాలతో, ఆల య ఆవరణలో ఉత్సవమూర్తులను శైలపుత్రిదేవి, గాయత్రిదేవి, సిద్ధిధాత్రి దేవిగా అలంకరించారు. పాతూరు కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూల విరాట్‌ను లక్ష్మీదేవిగా, ఆలయ ఆవరణలో గజలక్ష్మిగా అమ్మవారు దర్శనమి చ్చారు. మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో ఉత్సవ మూర్తిని మయూర వాహనంపై కౌమారిదేవిగా అలంకరించారు. పాతూరు వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో కాళికామాతను మహాలక్ష్మిగా అలంక రించారు. భక్తులు సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేశారు. రెండో రోడ్డులోని చంద్రశేఖరేంద్ర సరస్వతి జ్ఞానపీఠంలో అమ్మవారికి వనదుర్గ అలంకారం చేశారు. మధ్యాహ్నం దాదాపు 500 మందికి అన్నదానం చేశారు. సాయంత్రం పీఠం ఆవరణలో భక్తులు సామూహిక లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేశారు. శివబాలయోగి ఆశ్రమం, శివకోటి దేవాలయాల్లో లలితాదేవి అలంకారం చేసి, పూజలు నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 08 , 2024 | 12:14 AM